Who closed busy jagadish market

Jagadish Market closed, Jagadish Market locked, Jagadish Market commercial hub, Jagadish Market electronic gadgets, deserted Jagadish Market, property tax, GHMC officials locked jagadish market, deputy municipal commisioner shailaja

Jagadish Market, a well-known commercial hub of Hyderabad, peddling electronic gadgets, wore a deserted look on Thursday.

జగదీష్ మార్కెట్.. ఎవరు మూసివేయించారు..?

Posted: 02/26/2015 09:17 PM IST
Who closed busy jagadish market

అది నిత్యం బిజీగా వుండే సెంటర్. అందులోనూ రేడియోల కాలం నుంచి టీవీలు, వీడియో ప్లేయర్లు, వీడియో రికార్డర్లు వచ్చే వరకు కొంత మెరుగ్గానే ఆ సెంటర్ కు పేరు వచ్చింది. అందివచ్చిన సాంకేతిక విప్లవంతో మెల్లిగా కలర్ టీవీలు, పేజర్ లు సెల్ ఫోన్ల రాకతో ఆ సెంటర్ తనకు తానే సాటి అనిపించుకుంది. రాష్ట్రంలో ఏ మూల నుంచైనా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వచ్చే వారిని.. ఏదో ఒక వస్తువు కోసం ఇక్కడి వెళ్లమని.. అక్కడ లభిస్తుందని చెప్పి పనులు పురమాయిస్తుంటారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. అంత పాపులర్ సెంటర్ అది. అదే హైదరబాద్ నడిబోడ్డున వున్న అబిడ్స్ లోని జగదీష్ మార్కట్.

ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్ల విక్రయానికి నగరంలోనే పేరున్న అబిడ్స్ జగదీష్ మార్కెట్ ఒక్కసారిగా అరణ్యాన్ని తలపించింది. నిత్యం బిజీగా వుండే ఈ దుకాణాల సముదాయం.. కళావిహీనంగా మారింది. అక్కడేదో అప్రకటిత కర్ఫ్యూ విధించిన వాతావరణం అలుముకుంది. దీనికి కారణం ఆస్తి పన్ను బకాయిలు చెల్లించక పోవడం. అదేంటి దుకాణాలు బంద్ చేయడానికి అస్తి పన్నకు కారణం ఏంటని అంటారా.? ఈ సెంటర్ లోని దాదాపు 300 దుకాణాలకు మున్సిపల్ అధికారులు తాళాలు వేశారు. వ్యాపారులు రెండేళ్ల నుంచి పన్నులు చెల్లించటం లేదని, ఎన్ని సార్లు నోటీసులిచ్చినా స్పందించలేదని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శైలజ తెలిపారు. ఈ దుకాణాల నుంచి రూ.2 కోట్లకు పైగా బకాయలు రావాల్సి ఉందని వివరించారు.


జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagadeesh market  closed  tax  Arrears  

Other Articles