Actress s intimate scenes uploaded on social media goes viral

Actress's intimate scenes goes viral, Actress's intimate scenes uploades on social media, intimate scene of TV actress, tv actress intimate videos on YouTube, Navi Mumbai police, Cyber Crime Cell, Khandeswar, actor two cameraman and director, director absconding,

The Navi Mumbai police have recently arrested three persons for uploading an intimate scene of a TV actress on YouTube.

నటిని మోసం చేసిన నటుడు.. నెట్ లో వీడియో..

Posted: 02/26/2015 09:19 PM IST
Actress s intimate scenes uploaded on social media goes viral

అమె ఒక నటి.. నిట్టనిలువునా వంచనకు గురైంది. తనతో పాటు నటిస్తున్న నటుడు, దర్శకుడు, కెమెరామెన్ చేతిలో చిక్కుకుని అవమానం పాలైంది. వినడానికి విడ్డూరంగా వున్నా.. ఇది మాత్రం నిజం.. ముంబై లోని ఓ బుల్లితెర నటికి బూరెట గంపలో పడ్డట్టు మంచి ఆఫర్ లభించింది. ఎగిరి గంతేసిన నటి సినిమా తాలుకు షూటింగ్ జరుగుతున్న క్రమంలో ఒక రోజు అకస్మాత్తుగా ఫోన్ చేసి సినిమాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని చెప్పారు. దీంతో అమె వారిని నమ్మింది. దర్శకుడు, నటుడు, ఇద్దరు కెమెరామెన్లు చూసి నిజంగానే షూటింగ్ అనుకుందా నటి.

అయితే నటుడిని తన అందచెందాలతో, తన ఒంపు సొంపులతో లొంగదీసుకునే సన్నివేశాలను బాగా పండించాలని, అవే ఈ చిత్రానికి టర్నింగ్ పాయింట్ అంటూ దర్శకుడు చెప్పిన మాటలను నమ్మింది. అతను చెప్పినట్టు చేసింది. చివరాఖరికి షూటింగ్ ముగిసింది. అయితే త్వరలో విడుదల కావాల్సిన చిత్రంలో ఉండాల్సిన ఈ సన్నివేశాలు యూట్యూబ్ లో అఫ్ లోడ్ అయ్యాయి. వీటి గురించి తెలుసుకున్న నటి సినిమా దర్శకుడు, నటుడు, ఇద్దరు కెమెరామెన్లపై కేసు నమోదు చేసింది.

తనతో అసభ్యకర సన్నివేశాలలో నటించమని చెప్పిన నిందితులు వాటిని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారని పిర్యాదు చేసింది. కాగా తనతో ఈ సన్నివేశాలను గత ఏడాది నవంబర్ లో చిత్రీకరించగా, వాటిని గత నెల జనవరిలో అప్ లోడ్ చేశారని తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన నవి ముంబై పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో వున్నాడు. రంగంలోకి దిగన ముంబై సైబర్ క్రైం పోలీసులు యూట్యూబ్ నుంచి అసభ్యకర సన్నివేశాల వీడియోను తొలగించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bewafa  actress  actor  director  cameramen  arrest  

Other Articles