Passengers safety tops railway budget

government to invest 8.5 lakh crore in railways, Rail transport must be made reliable, Rail transport must be made comfortable, Suresh Prabhu debut railway budget, Rail transport should meet global standards, no increse in passenger train fares, railway budget 2015, Railway Minister Suresh Prabhu, suresh prabhu tabled railway budget, Railway finances under terrible strain, Suresh Prabhu no hike in the fares, budget initiatives besides enhancing safety and security, railway budget will hike freight charges, rail budget-2015, suresh prabhu, venkaiah naidu, railway budget highlights

Railway Minister Suresh Prabhu says 'Rail transport must be made reliable, comfortable and should meet global standards'

మహిళల భద్రత, వైఫై, 120రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ మరెన్నో..

Posted: 02/26/2015 03:11 PM IST
Passengers safety tops railway budget

రైల్వే బడ్జెట్లో మహిళా ప్రయాణీకులపై వరాల జల్లు కురిపించారు మంత్రి  సురేశ్ ప్రభు. మహిళల భద్రత కోసం టోల్  ఫ్రీ నెం. 182  ను  ప్రకటించారు.  మహిళా రక్షణ కోసం బోగీల్లో సీసీ కెమెరాలు  ఏర్పాటు.. మహిళా కోచ్ ల పెంపు.  వృద్ధులకు , వికలాంగులకు ఆధునిక  సౌకర్యాలు..ఆనలైన్ లో వీల్ ఛైర్ బుక్ చేసుకునే సౌలభ్యం. మహిళలకు, వృద్ధులకు  లోయర్ బెర్తులు  కేటాయించే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.  మహిళా బోగీల్లో  సౌకర్యాల పెంపుకోసం నిర్భయ ఫండ్ కింద నిధులను కేటాయించనున్నట్టు మంత్రి ప్రకటించారు.

రైలు ప్రయాణికులకు మంత్రి ఓ కొత్త వరం ప్రకటించారు. అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయాన్ని ఇపుడున్న 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచారు. ఇంతకుముందు 90 రోజుల ముందుగానే ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉండేది. ఆ తర్వాత దాన్ని 60 రోజులకు తగ్గించారు. తాజాగా రైల్వే మంత్రి చేసిన ప్రకటనతో.. 120 రోజులు ముందుగానే రిజర్వేషన్లు చేసుకునే అవకాశం ఏర్పడింది.  ప్రయాణికుల సౌకర్యాల కల్పన కోసం 67శాతం నిధులు కేటాయించనున్నట్లు సురేశ్‌ప్రభు తెలిపారు.

9 కారిడార్లలో రైళ్ల వేగం 120 నుంచి 160 కి.మీలకు పెంచుతామని వెల్లడించారు. రైళ్లలో అగ్నిప్రమాదాలు, పట్టాలు తప్పడం లాంటి ప్రమాదాల నివారణకు కార్యాచరణ ప్రణాళిక తీసుకురానున్నట్లు సురేశ్‌ప్రభు తెలిపారు. దేశంలో పలు రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యలకు రైల్వే మంత్రి సంతాపం తెలిపారు. భద్రత అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశమని పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించడానికి కాపలాలేని రైల్వే గేట్ల వద్ద ఆడియో-విజువల్ హెచ్చరికలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

మేఘాలయను అరుణచల్‌ప్రదేశ్ మీదుగా రైల్వేట్రాక్‌తో అనుసంధానం చేస్తామన్నారు. ఈ ఏడాది కొత్తగా 4 కొత్త సరకు రవాణా కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైల్వేలో బ్యాంకులు, పింఛను నిధులను పెట్టుబడులుగా స్వీకరిస్తామని వెల్లడించారు. హిందీ, ఇంగ్లిష్‌లతో పాటు ఇతర స్థానిక భాషల్లోనూ టిక్కెట్లు ఇచ్చేందుకు రైల్వే సిద్ధమైంది. వివిధ భాషల్లో ఈ-టిక్కెటింగ్ వ్యవస్థను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి తోడు 400 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలుఅందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
* 9 కారిడార్లలో రైళ్ల వేగం 120 నుంచి 160 కి.మీలకు పెంచుతాం
* రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం భారీగా పెంపు
* ఇస్రో, కాన్పూర్ ఐఐటీ సహకారంతో కాపలలేని క్రాసింగ్ వద్ద హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థ
* ముంబయి-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు కోసం పరిశీలన.
* 3438 లెవెల్ క్రాసింగ్‌ల తొలగింపునకు రూ.6750కోట్లు
* ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంతో నూతన ప్రాజెక్టులు, కొత్త ఉద్యోగాలు
* రైల్వేల్లో వికేంద్రీకరణకు పెద్దపీట
* 815 కి.మీ. దూరం గేజ్ కన్వర్షన్ ఈ ఏడాది అందుబాటులోకి వచ్చింది.
* జాప్యం లేకుండా నిర్దేశిత సమయానికి రైళ్లు ప్రయాణించేలా చర్యలు
* లైన్ల డబ్లింగ్ కోసం 77 కొత్త ప్రాజెక్టులకు అనుమతులు.
* వచ్చే మూడు నెలల్లో గూడ్స్ బోగీలు అద్దెకు ఇచ్చే సౌకర్యం.
* పచ్చి సరకు, కూరగాయలు, పండ్లు, రవాణాకోసం ప్రత్యేక ఏర్పాట్లు
* రైల్వేస్టేషన్ల అభివృద్ధి వ్యాపారీకరణకు ఆన్‌లైన్ బిడ్డింగ్
* వచ్చే మూడు నెలల్లో గూడ్స్ బోగీలు అద్దెకు ఇచ్చే సౌకర్యం
* రైల్వేలో బ్యాంకులు, ఫించను నిధుల పెట్టుబడులు
* అత్యున్నత ప్రమాణాలతో రైల్వేల నిర్వహణ, పారదర్శకత
* మౌలిక సదుపాయాల ఆధునీకరణ ద్వారా ప్రయాణికుల సంఖ్య పెంపునకు కృషి
* 400 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు
* స్వచ్ఛ రైలు, స్వచ్ఛభారత్ అమలు కోసం ప్రత్యేక విభాగం
* రైళ్లలో తక్కువ ధరకు రక్షిత మంచినీరు
* ప్రధాన స్టేషన్లలో లిఫ్ట్‌లు, ఎస్కలేర్ల ఏర్పాటుకు రూ.120 కోట్లు
* ప్రయాణికుల సౌకర్యాల కోసం ఎంపీల్యాడ్స్ నుంచి కొంత నిధులు ఇవ్వాలని ఎంపీలకు విజ్ఞప్తి
* రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఆర్థిక వనరుగా మార్చాలి.
* రైల్వేస్టేషన్ల అభివృద్ధి వ్యాపారీకరణకు ఆన్‌లైన్ బిడ్డింగ్.
* నగరాల్లో రద్దీ రైల్వేస్టేషన్లకు అనుబంధంగా కొత్తరైల్వేస్టేషన్లు నిర్మాణం.
* నగరాల శివార్లలో శాటిలైట్ రైల్వేస్టేషన్ల నిర్మాణం.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : railway budget 2015  Railway Minister  Suresh Prabhu  

Other Articles

Today on Telugu Wishesh