Lok sabha adjourned after opposition demands naidus apology

loksabha, parliament, adjouren, venkayya naidu, parliamentry affairs, rail budget, rahul gandhi

Parliamentary Affairs Minister M Venkaiah Naidu responded to the opposition's charge on Thursday, saying his remarks were misinterpreted and he didn't mean any disrespect to the opposition ahead of the tabling of the Rail Budget in Lok Sabha.

వెంకయ్య నాయుడి మాటలపై దుమారం

Posted: 02/26/2015 12:37 PM IST
Lok sabha adjourned after opposition demands naidus apology

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు పార్లమెంటులో దుమారం రేపాయి. వెంకయ్య క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్‌ చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విపక్షాలపై తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అన్ని పార్టీలను సమానంగా గౌరవిస్తానని ఆయన చెప్పారు. తాను ఎవరిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడలేదని వెంకయ్య వివరణ ఇచ్చారు. వెంకయ్య సభలో వివరణ ఇచ్చినప్పటికీ విపక్షాలు తమ ఆందోళన కొనసాగించారు. సభలో వెంకయ్యనాయుడు క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో స్పీకర్‌ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. బ్రేక్ తర్వాత కూడా విపక్షాలు వెంకయ్యపై మాటల దాడి చేశాయి. అయితే తాను ఎవరినీ బాధ పెట్టాలని మాట్లాడలేదని అన్నారు. ముక్కు సూటిగా మాట్లాడటం తనకు ముందు నుండి అలవాటని వెంకయ్య అన్నారు.
 
 సీనియర్‌ నేత, అనుభవజ్ఞుడు అయిన వెంకయ్యనాయుడు అందరినీ కలుపుకుని పోవాలన్నారు. అలా కాకుండా ప్రతిపక్షాలను అవమానపర్చడం సరికాదని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. సభ్యుల పట్ల అవహేళనగా మాట్లాడిన వెంకయ్య క్షమాపణ చెప్పాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. సభ్యుల పట్ల గౌరవం ఉందని వెంకయ్య చెప్పారని స్పీకర్‌ సుమిత్రామహజన్‌ సభ్యులకు తెలిపారు. ప్రతీవిషయానికి ఆందోళన చేయడం సరికాదని ఆమె అన్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : loksabha  parliament  adjouren  venkayya naidu  parliamentry affairs  rail budget  rahul gandhi  

Other Articles