Suresh prabhu debut railway budget no increse in train fares

Suresh Prabhu debut railway budget, no increse in train fares, railway budget 2015, Railway Minister Suresh Prabhu, suresh prabhu tabled railway budget, Railway finances under terrible strain, Suresh Prabhu no hike in the fares, budget initiatives besides enhancing safety and security, railway budget will hike freight charges,

Railway Minister Suresh Prabhu says there is no hike in the fares in the Rail Budget. It includes 'Make in India' initiatives besides enhancing safety and security.

సురేష్ ప్రభు. తీపి కబురు.. ప్రయాణికుల చార్జీలపై పెంపులేదు..

Posted: 02/26/2015 12:03 PM IST
Suresh prabhu debut railway budget no increse in train fares

2015-2016 సంవత్సరానికి రైల్వే వార్షిక బడ్జెట్‌లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు తొలిసారిగా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా బడ్జెట్ లో పోందుపర్చిన అంశాలను లోక్ సభలో సభ్యులకు తెలియజేస్తూ.. ప్రసంగం ప్రారంభించారు. రైలు ప్రయాణికులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బడ్జెట్ లో కేంద్రమంత్రి వారికి తీపి కబురును అందించారు. గత ఏడాది ప్రయాణికుల చార్జీలను 14.2 శాతం మేర పెంచి వాత పెట్టిన దరిమిలా.. ఈ ఏడాది అందుకు పూర్తి భిన్నంగా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికుల చార్జీలపై ఎలాంటి భారం వేయకుండా చర్యలు తీసుకుని వారికి శుభవార్తను అందించారు.

పరిశుభ్రత, రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు.  రైల్వేల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. దేశంలో ముఫై ఏళ్ల తరువాత వచ్చిన సుస్థిర, ధృడమైన ప్రభుత్వం రైల్వేలను మార్చితీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇకపై రైళ్లు నిర్ధేశిత సమాయాలకు వచ్చేట్లు చర్యలు చేపడుతున్నామని సురేశ్ ప్రభు తెలిపారు. తనకు కేంద్ర రైల్వేశాఖ పదవినిచ్చి.. రైల్వేల మార్పు బాద్యతను సవాల్ గా అందించిన ప్రధాని నరేంద్రమోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

* దేశ సామాజిక ప్రగతిలో రైల్వేలది కీలక భూమిక
* మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యం పేదరిక నిర్మూలనే
* రైల్వేలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తాం
* మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటే అదనపు పెట్టుబడులు అవసరం
* రాజధాని, శతాబ్ధి రైళ్లు 170 కి.మీ వేగంతో మాత్రమే ప్రయాణించగలవు
* పెండింగ్ ప్రాజెక్ట్ లకు పూర్తికి  ప్రాధాన్యత
*  భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన
*  రైల్వే బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
*  రైల్వేల మీద ఇటీవల ఒత్తిడి పెరిగింది
* అంచనాల భారం రైల్వేపై ఎక్కువగా ఉంది
* రైల్వేలు ఆర్థికంగా వృద్ధి చెందాల్సి ఉంది
* పెట్టుబడులు పెరిగితే ఉద్యోగాలు వస్తాయి
* ప్రజల మద్దతుతో రైల్వేలు మరింత అభివృద్ధి
* పర్యావరణ హితమైన అభివృద్ధే రైల్వేల లక్ష్యం
*గతంలో అనుకున్న రీతిలో రైల్వేలు అభివృద్ధి చెందలేదు

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : railway budget 2015  Railway Minister  Suresh Prabhu  

Other Articles