Delhi is the most polluted city in india

pollution, delhi, air pollution, who, pp, mbmt,

A WHO study released last year found Delhi to be the most polluted city in the world. Another study this week, said excess pollution is reducing the life expectancy of 660 million Indians by 3.2 years, on average.

కాలుష్యంలో ఢిల్లీనే నెంబర్ వన్.. వెల్లడించిన డబ్లు.హెచ్.ఒ

Posted: 02/26/2015 12:55 PM IST
Delhi is the most polluted city in india

దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల కారణంగా నిన్నటి వరకు వార్తలకెక్కింది. అయితే తాజాగా ఓ వార్త ఢిల్లీని నెంబర్ వన్ స్థానంలో కూర్చోబెట్టింది. అందమైన నగరమనో, లేక దేశానికి తలమానికం అనో ఇలా నెంబర్ వన్ స్థానానికి రాలేదు. కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ అన్ని నగరాలను తోసి, నెంబర్ వన్ గా నిలిచింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజాగా జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఢిల్లీలో సగటున సెకనుకు 10 మైక్రోమీటర్ల సాంధ్రతతో గాలి కలుషితమవుతోంది. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

2014 లో ఢిల్లీ 10 పిఎం, జార్ఖండ్ సల్ఫర్ డయోడ్ను అధికంగాను, పశ్చిమబెంగాల్ - నైట్రోజన్ డయాక్సైడ్ లను ఎక్కువగా కలిగి ఉన్నాయి. . పిహెచ్ఎఫ్ఐ పరిశోధనల ప్రకారం ఇప్పటివరకు ఢిల్లీలో 2004 సంవత్సరంలో అతి తక్కువ వాతావరణ కాలుష్యం నమోదైంది. అప్పటినుంచి ఇప్పటివరకు వాహనకాలుష్యాన్ని నివారించే ప్రత్యామ్నాయాల అన్వేషణలో ఢిల్లీ వాయుకాలుష్య శాఖ విఫలమైంది. అంతేకాకుండా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు కూడా వాయు కాలుష్యానికి మరో కారణంగా చెప్పవచ్చు.

వాయు కాలుష్యంవల్ల పిల్లల్లో ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయి. దీనివల్ల ఆస్తమా , ఊపిరితిత్తుల వ్యాధులు సోకే ప్రమాదం ఉందని ప్రముఖ వైద్యశాస్త్ర నిపుణులు డాక్టర్ కృష్ణ  తెలిపారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఆరోగ్యశాఖ వాయు కాలుష్య నివారణ చర్యలు చేపట్టింది.  ఇటీవల 170 దేశాల్లో నిర్వహించిన  వాయు కాలుష్య సూచీ పరిశోధనల ప్రకారం...చైనా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్లను వెనక్కినెట్టి భారత్ ప్రథమస్థానంలో నిలిచింది. ఈ సమస్యపై మసాచుసెట్స్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మైకేల్ గ్రీన్ స్టన్ వెల్లడించిన వివరాల ప్రకారం...భారత్, చైనా మరికొన్ని దేశాల్లోని ప్రజలు వాయు కాలుష్యానికి ఎక్కువగా గురి అవుతున్నట్లు వెల్లడైంది. అయితే ఢిల్లీలో ఎయిర్ ప్యురిపైర్ లు పెట్టాలని యూరోపియన్ యూనియన్ వారు సలహా ఇస్తున్నారు. పరిస్థితిని ఇలానే వదిలేస్తే మరింత ప్రమాదకరం అని కూడా వారు హెచ్చరిస్తున్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pollution  delhi  air pollution  who  pp  mbmt  

Other Articles