Salman khan s arms act case verdict on march 3

Salman Khan's Arms Act case verdict on March 3, salman khan illegal arms case adjourned, jodhpur court, verdict, Salman Khan case, hum sath sath hai, salman case adjourned, salman Khan hits, salman Khan Blackbuck poaching case, Blackbuck poaching latest news, salman khan latest updates, salman khan new updates, salman khan new photos, salman khan movies news, salman khan news, salman khan updates, salman khan new movies,

With Rs 200 crore riding on Bollywood superstar Salman Khan, the deferment of the Arms Act case verdict till March 3 has provided a small window of relief to producers of his two films that are set to release this year.

కండలవీరుడు సల్మాన్ చాలా కాస్ట్లీ.. జైలుకెళ్తే ఎలా మరి..?

Posted: 02/25/2015 03:06 PM IST
Salman khan s arms act case verdict on march 3

బాలీవుడ్ కండలవీరుడు, అగ్రనటుడు సల్మాన్ ఖాన్పై కొనసాగుతున్న అక్రమ ఆయుధం కేసులో తుది తీర్పును జోధ్పూర్ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ఇవాళ న్యాయస్థానం తుది తీర్పును వెలువరిస్తుందన్న వార్తలతో కోర్టు ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది. కాగా తుది తీర్పను మార్చి 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు బుధవారం న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసు విచారణ నిమిత్తం వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని సల్మాన్ తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు.

కాగా స్మలాన్ ఖాన్పై తుది తీర్పు వెలువడుతుందన్న నేపథ్యంలో బాలీవుడ్ లోని నిర్మాతల గుండెళ్లో రైలు పరిగెడుతున్నాయి. ప్రస్తుత్తం సల్మాన్ ఖాన్ నటిస్తున్నపలు చిత్రాలకు సంబధించి ఆయనపై బాలీవుడ్ సుమారు 200 కోట్ల రూపాయలను వెచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనకు శిక్ష ఖరారైతే.. తమ పరిస్థితి ఏంటని నిర్మాతలు జంకుతున్నారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం గుజరాత్ రాజ్ కోట్ సమీపంలోని సూరజ్ భర్జత్య చిత్రం గోండాల్ ప్రాంతంలో ప్రేం రతన్ ధన్ పాయో షూటింగ్ లో వున్నారు. ఈ చిత్రం త్వరలోనే పోస్టు ప్రోడక్షన్ పనులకు వెళ్లనుంది. కాగా ఎక్ థ టైగర్ చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్ దర్శకత్వంలో మరో చిత్రం భజరంగీ, భజరందీ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే సెట్స్ సై నుంచి పోస్టు ప్రోడక్షన్ పనులను జరుపుకుంటోంది.

ఈ రెండు చిత్రాలకు సంబంధించి చెరో 75 కోట్ల రూపాయలను ఇప్పటికే నిర్మాతలు వెచ్చించారని, మరో రెండు చిత్రాలకు సంబంధించి 50 కోట్ల రూపాయలను కూడా సల్మాన్ తో సినిమాకు ఖర్చు చేశారని, ఈ తరుణంలో సల్మాన్ ఖాన్ పై వున్న కేసులలో తుది తీర్పు వస్తే నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా ఒక వేళ సల్మాన్ ఖాన్ కు శిక్షను ఖరారు చేసినా.. అప్పీల్ కు వెళ్లే అవకాశం కూడా వుందని.. దీంతో నిర్మాతలు అధైర్య ంపడటం లేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
 
1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా నిర్మాణ సమయంలో రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో సల్మాన్ ఖాన్, సోనాలి బెంద్రె, టబు, నీలమ్ తదితరులు రక్షిత జంతువైన కృష్ణజింకను వేటాడారంటూ అప్పట్లో కేసు నమోదైంది. కృష్ణ జింకల వేటతో పాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారంటూ సల్మాన్‌ఖాన్‌పై రెండు వేర్వేలు కేసులు నమోదైయ్యాయి. ఈ రెండు కేసుల్లో ఒక దాంట్లో సంవత్సరం, మరో కేసులో ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ ట్రయల్‌ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  kabir khan  blackbuck  Arms Act case  

Other Articles