Obama endorsed indias membership

obama, america, unitednations, security council, pakistan, pm modi, alliance,

President Barack Obama endorsed India for membership on the United Nation’s Security Council, as it was among important reforms needed for the operation of the Council, according to the White House Press Secretary Josh Earnest.

ఐరాస భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి అమెరికా మద్దతు

Posted: 02/25/2015 03:58 PM IST
Obama endorsed indias membership

అంతర్జాతీయ వేదికలపై భారత్ వెలుగుతోంది. అన్ని దేశాలు భారత్ ను గౌరవిస్తున్నాయి. ప్రపంచలో నిర్ణయాత్మక శక్తిగా మారుతున్న భారత్ వైపు అన్ని దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ప్రపంచంలోని ఏ దేశంలో ఎలాంటి విధ్వంసం జరిగినా, భారత్ అందుకు స్పందిస్తోంది, అవసరమైతే సాయం చేస్తోంది. అయితే భారత్ కు అగ్రరాజ్యం సరసన కూర్చొని ప్రపంచ శాంతికి సంబందించిన నిర్ణయాలను తీసుకునే అధికారం మాత్రం ఇప్పటికీ దక్కలేద. ప్రపంచ శాంతిని కాంక్షిస్తు ఏర్పాటు చేసిన ఐక్యరాఝ్యసమితి, ఎంతో కీలకంగా వ్యవహరిస్తోంది. అయితే ఇలాంటి కీలక సంస్థ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై చాలా దేశాల్లోనూ చర్చ సాగింది.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి తమకు సమ్మతమే అని ఒబామా తాజాగా చెప్పారు. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ఒక ప్రకటనలో తెల్పింది. ఐక్యరాజ్య సమితి సంస్కరణలలో భాగంగా భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కొరకు అమెరికా గత కొంత కాలంగా మద్ధతిస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో భారత పర్యటనకు వచ్చిన ఒబామా పార్లమెంటులో ఇచ్చిన ఉపన్యాసంలో భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి తమ మద్ధతు ఉంటుందన్నారు. అయితే అమెరికా ఇలా భారత్ కు మద్దతివ్వడాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే భారత్ శాశ్వత సభ్యత్వానికి అర్హతలు లేవంటూ ఆరోపణలు చేస్తోంది. అలాంటి వ్యాఖ్యలను లెక్కచెయ్యకుండా, అమెరికా ఈసారి భారత్ కు బాసటగా నిలిచింది. మొత్తానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం దాదాపుగా ఖరారైనట్లే.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : obama  america  unitednations  security council  pakistan  pm modi  alliance  

Other Articles