Kcr focus on yadagirigutta temple development

kcr, yadagirigutta, endoment, temples, lakshminarasimha swamy temple, budget

telanagan cm kcr focus on development of yadagiriguta lakshminarasimha swamy temple. he announce that govt will allot 100cr for temple devlopment.

యాదగిరిగుట్టకు కొత్త రూపం.. ప్రణాళిక సిద్దం చెయ్యాలని కెసిఆర్ ఆదేశం

Posted: 02/25/2015 04:13 PM IST
Kcr focus on yadagirigutta temple development

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట రూపురేఖలను మార్చనున్నారు కెసిఆర్. అందుకు అనుగుణంగా అన్ని రకాలుగా ఆలయ నిర్మాణాన్ని, నిర్వహణను మార్చడానికి మాస్టర్ ప్లాన్ సిద్దంగా ఉంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్. ఏపిలో తిరుపతిలాగా తెలంగాణలో యాదగిరిగుట్టను అభివృద్ది చేస్తామని, పర్యాటక రంగానికి అనువుగా ఆలయ రూపురేఖలను తీర్చిదిద్దనున్నారు. ఆలయ ఆదాయంపై దృష్టి పెట్టకుండా, భక్తుల మనోభావాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తామని కెసిఆర్ ముందు నుండి చెబుతూనే ఉన్నారు.

అందులో భాగంగా యాదగిరి గుట్ట అభివృద్ధికి బడ్జెట్‌లో 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి విషయంలో ఢిల్లీలోని అక్షరధామ్, అమృతసర్‌లోని స్వర్ణదేవాలయం వంటి ప్రఖ్యాత ఆలయాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యాదగిరి గుట్ట గుడి డిజైన్లు ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారమే ఉండాలని స్పష్టం చేశారు. ఆలయ స్పెషల్ ఆఫీసర్ జీ కిషన్‌రావు, సంబందిత అధికారులు ముఖ్యమంత్రిని కలిశారు. యాదగిరి గుట్ట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. దీనికి గుట్ట ప్రత్యేకాధికారి జీ కిషన్‌రావు చీఫ్‌గా ఉంటారని పేర్కొన్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  yadagirigutta  endoment  temples  lakshminarasimha swamy temple  budget  

Other Articles

Today on Telugu Wishesh