Central govt didnt giving prioroty to telugu states

telangana, andhrapradesh, new states, financial commission, budget, defcit, ap, ts, central govt, grants, surplus

central govt did not giving priority to telugu states. ap state suffering with defcit budget, so the ap need more grants for its programmes. telangana hope more funds from central to start new schmes.

తెలుగు రాష్ట్రాలకు నిరాశేనా..?

Posted: 02/25/2015 03:19 PM IST
Central govt didnt giving prioroty to telugu states

తెలుగు వారమండీ నిండుగ వెలుగు వారమండీ అంటూ అప్పుడెప్పుడో విన్న మాట, అన్న మాట కూడా. ఇప్పుడు తెలుగు మాత్రం మిగిలింది కానీ వెలుగు లేదు. తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కేంద్రం దయ కోసం ఎదురుచూస్తున్నాయి. ఎప్పుడెప్పుడు నిధులు విడుదల చేస్తారా అని రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఎదురుచూస్తున్నారు. అయితే ఎదురుచూపుకు అర్థంలేకుండా పోయింది. ఆది నుండి దక్షిణాది రాష్ట్రాలంటేనే కేంద్రానికి చిన్న చూపు అన్న విషయం మరోసారి నిజమైంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు కాబట్టి వాటి ఆర్థిక పరిపుష్టి కొరకు కేంద్రం ఉదారంగా నిధులను సమూకూరుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది.

ఫైనాన్స్ కమీషన్ ప్రతిపాదనల్లో ఎక్కడా తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు కానీ గ్రాంట్లు కానీ విడుదల చెయ్యలేదు. అయితే ఏపిలో తీవ్రమైన లోటు కారణంగా 22వేల కోట్ల రూసాయల సాయం చెయ్యాలని ఆర్థికమంత్రి ప్రకటించారు. ఆర్థికమంత్రి ప్రకటనతో తెలుగు వారు నిరాశకు గురయ్యారు. తెలంగాణ ఊసేలేకుండా పోయింది. మొత్తానికి అటు తెలంగాణకు, ఇటు ఏపికి కనీస ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇలా కేంద్రం రెండు రాష్ట్రాలను ఆదుకోకుండా, తన పంథాలో వెళ్తోంది. అయితే రాష్ట్రాలకు కేంద్ర పన్ను వాటాలో 42శాతం ఇవ్వనుందని, అన్ని రాష్ట్రాలు అభివృద్ది వైపు పరుగులు తియ్యాలని మోదీ పిలుపునిచ్చారు. మోదీ మాటలు నిజం రాష్ట్రాలు బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. అయితే దేశంలో అన్ని రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు భిన్నం. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఒకటి, ఇంకా కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రం మరోకటి. ఇలా ఎన్నో కష్టాల్లో ఉన్న రెండు రాష్ట్రాలకు చేయూతనియ్యాల్సిన కేంద్రం వాటి గురించి ఆలొచించడం లేదు. ఉమ్మడిగా ఉన్నప్పుడు దేశంలో వేగంగా అభివృద్ది చెందిన తెలుగు రాష్ట్రం ఇప్పుడు మాత్రం అభివృద్దికి ఆమడ దూరంలో ఉంటున్నాయి.

అయితే తాజాగా కేంద్రం విడుదల చెయ్యాలనుకున్న నిధులపై రెండు తెలుగు రాష్ట్రాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అడిగిన  దాంట్లో కనీసం పది శాతం నిధులు కూడా రాలేదని, కొత్తగా ఏర్పాటు అయిన రాష్ట్రం అన్న కనీస దయ కూడా లేదని ఏపి నాయకులు మండిపడుతున్నారు. కేంద్రం నిధులపై ఎన్నో నిధులను ఆశించిన తెలంగాణకు ఇదే జరిగింది. వారి ఆశలపై నీళ్లు జల్లింది కేంద్రం. తూతూ మంత్రంగా ఎంతో కొంత విదిల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు అసలు విషయం అర్థం కాదని కొందరు అనుకుంటున్నారు. కాగా కనీసం ఇప్పటికైనా రెండు రాష్ట్రాలకు చెందిన నేతలు మేల్కొని కేంద్రంపై వత్తిడి తేవాలని సూచిస్తున్నారు.
 - అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  andhrapradesh  new states  financial commission  budget  defcit  ap  ts  central govt  grants  surplus  

Other Articles