Travel bus neglected in outer ring road

travel bus neglected in outer ring road, dhanunjaya private travels bus, buses from vishakapatnam to hyderabad, bus tickets from hyderabad to vishaka, bus tickets from vishaka to hyderabad, dhanunjaya travels bus neglected on outter ring road, private travels busses,

private travels bus boarding from vishakapatnam to hyderabad neglected on outter ring road

ప్రవేటు ట్రావెల్స్ అరాచకం.. ప్రయాణికులకు జాగారం..

Posted: 02/25/2015 02:13 PM IST
Travel bus neglected in outer ring road

ప్రవేటు ట్రావెల్స్ అరచకాలకు పరాకాష్టగా నిలుస్తోంది ఈ ఘటన. అర్థరాత్రి పూట అటవీ ప్రాంతంలో బస్సును నిలిపి.. మీ చావు మీరు చావండి.. ఇక బస్సు ఒక్క ఇంచు కూడా కదలదూ అంటూ డ్రైవర్ మొండికేయడంతో ప్రయాణికులు రాత్రంతా జాగారం చేసుకుంటూ.. బిక్కుబిక్కు మంటూ వెళ్లదీయాల్సి వచ్చింది. ప్రయాణికులు టిక్కట్టు బుక్ చేసుకునే ముందు ట్రావెల్ ఏజెంట్లు చెప్పే కబర్లు.. అన్ని వాస్తవ రూపంలో నీటి బుడగలని తెలిసినా.. అవసరాల నేపథ్యంలో సర్ధుకుపోతున్న ప్రయాణికులపై ప్రతీరోజు ఏదో ఒక రూపంలో ప్రైవేటు ట్రావెల్స్ తమ అరాచకాలను సృష్టిస్తునే వున్నాయి. క్షేమంగా గమ్యానికి చేర్చాలిన బస్సులు ప్రయాణికులను నడిరోడ్డు పైనే వదిలేస్తున్నాయి. నిన్నదీపికా ట్రావెల్స్... నేడు న్యూ ధనుంజయ ట్రావెల్స్... ప్రయాణికులను నడిరోడ్డుపై రాత్రంతా జాగారం చేయించాయి.

హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో విశాఖపట్నం బయల్దేరిన న్యూ ధనుంజయ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ అవుటర్ రింగ్‌ రోడ్డుపైన నిలిచిపోయింది. సరిగ్దా అప్పటి బస్సు బయలుదేరి గంటన్నర కూడా కాలేదు. ఎయిర్ లాక్ అయిందంటూ బస్సును అర్ధంతరంగా నిలిపివేసిన డ్రైవర్ తనకు బాధ్యత లేదన్నట్టు వ్యవహరించాడు. విశాఖ పట్నానికి చేరుకునే క్రమంలో అదీ హైదరాబాద్ దాటిదాటక ముందే ఈ ఘటన జరిగింది. అయినా డ్రైవర్ కానీ, ట్రావెల్స్ యాజమాన్యం కానీ ఏ మాత్రం స్పందించలేదు. హుటాహుటిన వేరే బస్సును పంపించి ప్రయాణికులను సరక్షితంగా గమ్యస్థానాలకు చేరాల్సిన యాజమాన్యం కూడా తమకు పట్టనట్ల వ్యవహరించింది. దీంతో ప్రయాణికులు రాత్రంతా అవుటర్‌పై అవస్థలు పడ్డారు. ట్రావెల్స్ మేనేజ్‌మెంట్‌కి ఫోన్‌ చేసినా కూడా ఎలాంటి స్పందన లేదు. దీంతో రాత్రంతా ప్రయాణికులు ఔటర్ రోడ్డుపై జాగారం చేశారు. అదీనూ చిమ్మచీకటి, అటవీ ప్రాంతానికి ఏమాత్రం తీసిపోని విధంగా వుంటే రోడ్డపై నానా అవస్థలు పడ్డారు. ఇవాళ తెల్లవారు జాము వరకు పరిస్థితి అలానే వుండింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి బస్సు యాజమాన్యంతో చర్చలు జరిపి వేరే బస్సును తెప్పించి ప్రయాణికులను పంపించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : private travels  Neglected  outer ring road  

Other Articles