Rahul leave new photos shows he is in uttarakhand

rahul gandhi, photos, congress party, Uttarakhand, Jagdish Sharma, Twitter

A Congress worker Wednesday released pictures of congress party vice-president Rahul Gandhi in Uttarakhand, but the Congress refused to comment. Jagdish Sharma released the pictures on Twitter showing Gandhi camping in the hills

రాహుల్ ఇక్కడున్నాడు.. నెట్ లో ఫోటోలు, రాహుల్ పై విసుర్లు

Posted: 02/25/2015 01:53 PM IST
Rahul leave new photos shows he is in uttarakhand

దేశానికి కాబోయే కాంగ్రెస్ ప్రధాని  అంటూ ఎన్నికలకు ముందు రాహుల్ ను ఆకాశానికెత్తిన కాంగ్రెస్ నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత షాక్ తిన్నారు. ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎక్కడ ప్రచారం చేసినా అక్కడ పెద్దగా ఓట్లు రాలలేదు. ముఖ్యంగా మోదీ మానియాను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు రాహుల్. అయితే తాజాగా అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాల్సిన రాహుల్ సెలవు పెట్టడం అందరికి ఆశ్చర్యం కలిగించింది.

పార్లమెంట్ లో తమ పార్టీ సభ్యులకు నాయకత్వం వహించవలసిన రాహుల్‌ కనబడకుండాపోయారు. గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ, భవిష్యత్తు మీద ఎంతో ఆశలు ున్కన కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన రాహుల్ కీలకమైన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. అయితే రాహుల్ అలా చెయ్యాల్సిన అవసరం ఏంటి, సెలవు పెట్టి ఏం చెయ్యబోతున్నారని మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అయితే తాజాగా వచ్చిన కొన్ని ఫోటోలు రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్ లో ఉన్నట్లు తెలుపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగదీశ్ శర్మ రాహుల్ గాంధీ ఫోటోలను విడుదల చేశారు. రాహుల్ దేశం గురించి విపరీతంగా ఆలోచిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చెయ్యడానికి మేధోమదనం చేస్తున్నారన్నారు. త్వరలో జరగనున్న బెంగళూరు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోబోతోందని, ఆ నిర్ణయాల్లో తన ముద్ర ఉండేలా రాహుల్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని శర్మ వివరించారు.

rahul
 
అయితే ఈ ఫోటోలపై కూడా కాంగ్రెస్ మండిపడుతోంది. అసలు అవి ఇప్పటి ఫోటోలు కాదని, 2008 లో రాహుల్ దిగిన ఫోటోలని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కొందరు మాత్రం రాహుల్ గాంధీ విదేశాల్లో సేద తీరుతున్నారని అనుకుంటున్నారు. మొత్తానికి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడపాల్సిన నాయకుడు ఇలా సెలవంటూ వెల్లిపోవడం ఏంటని కాంగ్రెస్ నాయకులు కూడా అనుకుంటున్నారు. అధికారపక్షాన్ని ఇరకాటంలో పెట్టాల్సింది పోయి, ఇలా ఎవరికీ కనిపించకుండా తిరగడం ఏంటి అని రాహుల్ అభిమానులు కూడా అనుకుంటున్నారు. రాహుల్ గాంధీ సెలవుపై అంతర్జాతీయ మీడియాలోనూ వార్తలు ప్రసారమవుతున్నాయి. బిబిసి ఛానల్ రాహుల్ గురించి, జాతీయ మీడియా ప్రసారం చేసిన, ప్రచురించిన కథనాలను వాడుకుంది. కాలం అన్ని గాయాలకు మందేస్తుందన్న విషయాన్ని బహుశా రాహుల్ మరిచిపోయారేమో.
 - అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  photos  congress party  Uttarakhand  Jagdish Sharma  Twitter  

Other Articles