Amnesty international criticise modi

amnesty, pm narendra modi, criticise,good governence , expectations, land pooling act, the new govt

amnesty international criticise pm narendra modi. the pm going to introduce new land pooling act, may it will harmful to farmers. the new govt didnt give the good governence. people have more expectations on pm modi.

ప్రజలను కష్ట పెడుతున్న మోదీ సర్కార్..ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడి

Posted: 02/25/2015 11:44 AM IST
Amnesty international criticise modi

అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటనకు ముందు భారత్ గురించి, ప్రధాని మోదీ గురించి అంతర్జాతీయ మీడియా ఊదరగొట్టింది. ప్రపచ దేశాలతో భారత్ ఎంతో భిన్నం అని రకరకాల కథనాలు ప్రచురించాయి. అయితే తాజాగా ఆమ్నెస్టి సంస్థ ఇచ్చిన నివేదికపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నివేదికలో వెల్లడించిన వివరాలపై అంతర్జాతీయ మీడియాలో పలు కథనాలు ప్రసారమవుతున్నాయి. భారత్ లో మోదీ హయాంలో ప్రజలకు గడ్డుకాలం వచ్చిందని ప్రధానంగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేసింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న భూసేకరణ చట్టం సవరణ బిల్లు ద్వారా దేశంలో చాలామంది భారతీయులు గడ్డు పరిస్థితిని ఎదుర్కోనున్నారని ఆ సంస్థ పేర్కొంది. మే 2014లో జరిగిన సాధరణ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జరిగిన పలు హింసాత్మక ఘటనలు పరిశీలనలోకి తీసుకున్న ఆమ్నేస్టీ.. జరిగిన ఘర్షణలన్నీ కూడా కార్పోరేట్ ప్రాజెక్టుల నేపథ్యంలో జరిగినవేనని పేర్కొంది. ఆ ప్రాజెక్టు నిర్మించే క్రమంలో అక్కడి వారిని సంప్రదించకుండా ఉండటం వల్ల వర్గాలుగా ఏర్పడి ఘర్షణలు తలెత్తుతున్నాయంది. ప్రజలకు సుస్థిరమైన, సురక్షితమైన పాలనను అందిస్తానని, మెరుగైన వసతులు కల్పిస్తానని అధికారంలోకి వచ్చిన మోదీ అనంతరం ఎవ్వరినీ సంప్రదించకుండానే ప్రాజెక్టులు పూర్తి చేసేలా, కార్పొరేట్ సంస్థలకు తలొగ్గేలా పనిచేస్తున్నారని విమర్శించింది.

మొత్తానికి మోదీ పై నిన్నటి దాకా పాజిటివ్ గా వచ్చిన కథనాలు చూసి, బోర్ కొట్టిన ప్రతిపక్షాలకు మంచి టైంపాస్ దొరికింది. దేశంలో రైతుల ప్రయోజనాలను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలకు మంచి ఆధారం దొరికింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించిన వివరాలతో పార్లమెంట్ ను స్తంభింపజేసే ఆలోచనలో ఉన్నాయి ప్రతిపక్షాలు. మోదీ వైఖరిపై, అనుసరిస్తున్న ధోరణిపై ఆమ్నెస్టీ వెల్లడించిన వివరాలు సరికొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారనున్నాయి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amnesty  pm narendra modi  criticise  good governence  expectations  land pooling act  the new govt  

Other Articles