Ts cm kcr disapointed on financial commission proposals

the financial commission, kcr, telanagana, taxes, grants, funds, new state, budget, central govt, proposals

telanagana cm kcr expect more funds from the central govt in this budget. he request more grants to new state of telanaga. but the financial commission didnt spent grants in extra to telangana.

తెలంగాణకు మొండిచెయ్యేనా..? కేంద్రం నుండి చాలీచాలని నిధులు

Posted: 02/25/2015 08:29 AM IST
Ts cm kcr disapointed on financial commission proposals

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆర్థిక సంఘం సిఫారసులు చూసి తెలంగాణ ప్రభుత్వం విస్తుపోయింది. తమ విన్నపాలన్నీ బుట్టదాఖలయ్యాయంటూ ఆక్రోశిస్తోంది. ఏటా కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వచ్చే వాటా, కేంద్ర పథకాలకు వచ్చే గ్రాంట్లకు అదనంగా... కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధికి కనీసం 70 వేల కోట్లు అందించాలని ఆర్థిక సంఘాన్ని కేసీఆర్‌ కోరారు. తెలంగాణలోని పది జిల్లాల్లో ఆరు తీవ్ర కరువు జిల్లాలు. కొన్ని జిల్లాల్లో ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ అభివృద్ధి, వికాసానికి చేపట్టిన మిషన్‌ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌ తదితర కార్యక్రమాలతోపాటు ఎస్సీ, ఎస్టీల భూముల పంపిణీ, రైతుల రుణమాఫీ పథకాల అమలుకు కేంద్రం నుంచి అదనంగా రూ.70 వేల కోట్లు కావాలని కెసిఆర్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీని సిఫారసు చేయాలని, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి అదనపు సాయం చేయాలని కోరారు. ఈ విన్నపాలన్నింటినీ ఆర్థిక సంఘం తోసిపుచ్చింది. ఐదేళ్లలో రూ.20,951 కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని కోరగా... రూ.10,128 కోట్లతో సరిపెట్టింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలంగాణను మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా చూపించి, ఎలాంటి అదనపు సాయాన్ని సిఫారసు చేయకపోవడం దారుణమని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : the financial commission  kcr  telanagana  taxes  grants  funds  new state  budget  central govt  proposals  

Other Articles