Priyanka told that she has life threat

priyanka gandhi, himachal pradesh, rtact, property, debashis bhattacharya

priyanka gandhi wrote a letter to himachal pradesh govt on her property issue. in the letter she told that she had life threat if the propertys detals will reveal.

ఆస్తుల వివరాలు వెల్లడిస్తే..నా ప్రాణానికే హాని: ప్రియాంకగాంధీ

Posted: 02/25/2015 08:08 AM IST
Priyanka told that she has life threat

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ ఒక సంచలన ప్రకటన చేశారు. నా ఆస్తుల వివరాలు వెల్లడిస్తే నా ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. దయచేసి, ఆ వివరాలు రహస్యంగా ఉంచండి ఆమె హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. హిమాచల్‌లో ప్రియాంక ఆస్తులు సమకూర్చుకోవడం పై వివాదాలు తలెత్తాయి. అయితే ప్రియాంక గాంధీ ఆస్తుల వివరాలను తెలపాలని దేబాశిష్‌ భట్టాచార్య అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాచార హక్కు చట్టం కింద కోరారు. ఆమెకు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి, వాటి సేల్‌ డీడ్స్‌, డాక్యుమెంట్లు, పవర్‌ ఆఫ్‌ అటార్నీ లాంటి వివరాలను అందజేయాలని సమాచార హక్కుల ద్వారా కోరారు. అయితే అంత త్వరగా ఆస్తుత వెల్లడికి ఇష్పపడని అధికారులు,  దేబాశిష్‌ భట్టాచార్య తో అనేక సార్లు ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి. దాదాపు ఓ సంవత్సరం పాటు ఇలా కాలం వెల్లదీశారు అధికారులు. అయినా ప్రియాంక ఆస్తుల వివరాలు తెలపాల్సిందే అంటూ భీష్మించుకు కూర్చున్నారు  దేబాశిష్‌ భట్టాచార్య.
 
 సమాచార హక్కుల చట్టం కింద పెట్టుకున్న దరఖాస్తు కాబట్టి అధికారులు తప్పకుండా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ అధినేత్రి కూతురు కాబట్టి అసలు వివరాలను తెలిపితే చిక్కుల్లో పడతామనుకున్నారేమో అధికారులు అందుకే కొత్త ఉపాయాన్ని ఆలోచించారు.  ప్రియాంక స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ భద్రత పొందుతున్నారని, ఆమె ఆస్తుల గురించి బయటికి చెప్పలేమని తేల్చేశారు. ఇదే క్రమంలో గత ఏడాది జులైలో ప్రియాంక కూడా హిమాచల్‌ ప్రభుత్వానికి ఒక లేఖ రాసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : priyanka gandhi  himachal pradesh  rtact  property  debashis bhattacharya  

Other Articles