Cm kcr call to ttdp mlas to join the trs

trs, ttdp, chandrababu, kcr, talasani, teegala krishnareddy, prakashgoud mla,

trs party inviting the ttdp mlas in.some telanagana tdp leaders joined the trs party in last two three months. talasani, teegala krishnareddy and many more leaders wear trs cap.

టిటిడిపి ఎమ్మెల్యేలకు కెసిఆర్ ఫొన్!..టిఆర్ఎస్ లో చేరాలంటూ పిలుపు?

Posted: 02/25/2015 08:44 AM IST
Cm kcr call to ttdp mlas to join the trs

తెలుగుదేశం పార్టీ నుండి మరికొన్ని వలసలు కొనసాగుతాయా అంటే ప్రస్తుతం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత కొంత కాలంగా టిడిపిని అన్ని రకాలుగా దెబ్బతీస్తున్న టిఆర్ఎస్, ఆ పార్టీ నుండి భారీగా వలసలకు ప్రేరేపించింది. అయితే తాజాగా టిడిపి ఎమ్మెల్యేలకు కెసిఆర్ స్వయంగా ఫోన్ చేసి పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు సమాచారం. కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌ టీడీపీ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, ప్రకాశ్‌ గౌడ్‌ తమ పార్టీలో చేరడం ఖాయమై పోయిందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ వర్గాలు మాత్రం దానిని నిర్ధారించడం లేదు. కొంతకాలం క్రితం టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టిన టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్‌, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవల తెలంగాణ జిల్లాల్లో యాత్రలు ప్రారంభించడంతో దానికి ప్రతి వ్యూహాలపై టీఆర్‌ఎస్‌ నాయకత్వం దృష్టి పెట్టింది. చంద్రబాబు వరంగల్‌ యాత్రకు ఆ పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన వచ్చింది. మార్చి మూడో తేదీన ఆయన కరీంనగర్‌ జిల్లా పర్యటన చేపట్టనున్నారు. ఈ సమయంలో టీడీపీ నుంచి మరి కొంతమంది ఎమ్మెల్యేలను లాగగలిగితే ఆ పార్టీ కొంత బలహీనంగా మారుతుందని టిఆర్ఎస్ ఆలోచిస్తోంది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trs  ttdp  chandrababu  kcr  talasani  teegala krishnareddy  prakashgoud mla  

Other Articles