Rk pachauri steps down as ipcc chief after sexual harassment case

RK Pachauri steps down as IPCC chief, RK Pachauri steps down after sexual harassment case, RK Pachauri head of the UN's climate science panel, Pachauri sexually harassed a subordinate.woman, employee, Pachauri sexual harassment, new delhi, rk pachuri,

Nobel prize winner RK Pachauri steps down as IPCC chief after sexual harassment case

లైంగిక ఆరోపణల నేపథ్యంలో తప్పుకున్న పచౌరీ

Posted: 02/24/2015 10:20 PM IST
Rk pachauri steps down as ipcc chief after sexual harassment case

ప్రముఖ పర్యావరణ వేత్త, నోబుల్ బహుమతి గ్రహీత ఐపీసీసీ ఛైర్మన్ డాక్టర్ రాజేంద్ర పచౌరీ(74) తాత్కాలికంగా తన విధులకు సెలవు తీసుకున్నట్లు ప్రకటించారు. ఓ మహిళ ఉద్యోగిపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. 29 సంవత్సరాలు రీసెర్చ్ అనలిస్ట్ అక్టోబర్ 2013 నుంచి జవరి 2015 వరకు ఇద్దరి మధ్య జరిగిన మెయిల్స్, మెసేజేస్, వాట్సప్ ఛాటింగ్ విషయాలను బయటకు తెలియపరుస్తూ కేసు నమోదుకు పోలీసులను ఆశ్రయించింది.

కేసు నమోదు చేసుకుని పోలీసులు పచౌరీ అరెస్టుకు రంగం సిద్ధం చేయగా బెయిల్ నిమిత్తం ఢిల్లీ కోర్టుని ఆశ్రయించాడు. బెయిల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు గురువారం వరకు అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. వాతావరణ మార్పులపై ఎప్పుడూ ముందుండి గొంతు వినిపించే, డాక్టర్ పచౌరీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నారు. కంప్యూటర్ హ్యాకింగ్ వల్ల బాధితుడినయ్యానని ఆయన పేర్కొన్నారు. ఈ లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా నైరోబీలో జరిగే ఐపీసీసీ నాలుగు రోజులు సమావేశాలకు వెళ్లలేకపోయినట్లు తెలిపారు.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : metro rail  hyderabad metro rail  hyderabad  telangana  

Other Articles