Qualified wife can t sit idle and claim maintenance

Qualified wife can't claim maintenance, Bombay High Court sensational judgement, well qualified wife is not entitled to claim maintainance, qualified can't harass her husband by claiming maintenance, wife capable to earn can't claim maintenance, Family, family court, maintenance, Bombay High Court

A well qualified wife is not entitled to remain idle and harass her husband by claiming maintenance when she is capable to earn

‘‘కూర్చోని భరణం అడిగితే కుదరదు’’ సంచలన తీర్పు

Posted: 02/24/2015 02:24 PM IST
Qualified wife can t sit idle and claim maintenance

భర్తల నుంచి విడాకులు పోందిన భార్యాలకు భరణం చెల్లించే విషయంలో బాంబై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఉన్నత ఉద్యోగాలను చేసేందుకు అన్ని అర్హతలు వున్న సతులు వారి పతుల నుంచి భరణం పోందేందుకు అర్హులు కాదని తీర్పును వెలువరించింది. సంపాదించేందుక అన్ని అర్హతలు వున్నా.. భరణం కోసం భర్తలను భాదించడం సముచితం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భర్త సంపాదనను యోగ్యత కలిగిన భార్యలు.. వారి భర్తల నుంచి భరణం పొందే ప్రయోజనాన్ని పొందడం తప్పేనన్నారు.

ముంబాయి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి భార్య కోర్టును ఆశ్రయించి భరణం కావాలని అడిగిన కేసు పూర్వాపరాలను పరిశీలించిన తరువాత ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ కేసులో భార్య అద్బతంగా సంపాదించే అవకాశాలను వదులుకుని కేవలం భర్త భరణంపైనే ఆధారపడాలని ఆశించడం కుదరదని, దీంతో ఆమెకు భరణం లభించే అవకాశం లేదని తేల్చిచెప్పింది. భరణం అన్నది అర్హత లేని భర్యాలకు మాత్రమే వర్తిస్తుందని అభిప్రాయపడింది. భర్త నుంచి విడాకులు పోంది ఏమి చేయాలో దిక్కుతోచని బార్యలు, వారి జీవనంతో పాటు పిల్లల భవిష్యత్తు ఇచ్చే నెలవారి ఖర్చులని స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళ్తే ముంబాయికి చెందిన ప్రముఖ వ్యాపారికి కోట్ల రూపాయల వ్యాపారాలు వున్నాయని, ఆయన అన్నదమ్ములు కూడా వ్యాపారాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారని, అత్తవారింటి ఆరళ్లు భరించలేక తాను ఇప్పుడు వేరుగా వుంటున్నానని ఈ క్రమంలో తనకు భరణం కల్పించాలని ఆయన సతీమని కోర్టును ఆశ్రయించింది. దేశీయంగా, విదేశీ వ్యాపారాలతో నెలకు సుమారు పదిహేను లక్షల రూపాయల మేర వారు ఆర్జిస్తున్న క్రమంలో తనకు భరణం కింద నెలకు రెండు లక్షల రూపాయలను భరణం కింద ఇప్పించాలని కోరింది. తన తల్లిదండ్రులపై తాను ఆదనంగా భారం వేస్తున్నానని వాటికి ఖర్చుల కింద భరణం ఇప్పించాలని బాంబే హైకోర్టును కోరింది.

కాగా వ్యాపారి తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తాను చట్టబద్దంగా తన భార్యను వివాహమాడలేదని, అయితే గత ఏడాది సెప్టెంబర్ మాసంలో అమె తనకు ముస్లిం సంప్రదాయం ప్రకారం విడాకులు ఇచ్చిందని తెలిపారు. దీనికి తోడు అమె డైటీషియన్ అని, ఇప్పటికీ పలు ప్రముఖ ఆస్పత్రులలో ఆమె డైట్ కౌన్సిలింగ్ క్లాసులు తీసుకుంటుందని తెలిపారు. దీని ద్వారా అమె నెలకు రమారమి 50 వేల రూపాయలను ఆర్జిస్తారని చెప్పారు. అంతేకాకుండా సుమారు కోటి రూపాయల బంగారు, వజ్రాభరణాలు అమె పేరిట వున్నాయని వాటిని ప్రత్యేక బ్యాంక్ లాకర్ లో దాచిందని వాదనలు వినిపించారు.

ఉభయపక్షాల వాదప్రతివాదలను పరిశీలించిన న్యాయస్థానం అన్ని యోగ్యతలు వున్న భార్యకు.. భర్త నుంచి భరణం పోందే అవకాశం లేదని చెప్పింది. భర్త నుంచి భరణం పొందేందుకు ఖాళీగా కూర్చోని భరణం అడిగితే కుదరదని స్పష్టం చేసింది. సంపాదించే యోగ్యత వున్న తరువాత భరణం కోసం భర్తలను వేధించడం కూడా సముచితంకాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bombay High Court  family court  maintenance  

Other Articles