Police arrested a drug supply gang

hyderabadpolice, cocaine, drugs, drug gang, sushank reddy,

hyderabad police arrested a nigerian and tollywood producer in the drug supply probe. police handover 80grams cocain fron the gang.

హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్..అందులో తెలుగు నిర్మాత

Posted: 02/24/2015 08:52 AM IST
Police arrested a drug supply gang

దేశంలో డ్రగ్స్ వాడకం రోజురోజుకు పెరుగుతోంది. డత కొంత కాలంగా విదేశాల నుండి మాదకద్రవ్యాల దిగుమతిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. అయినా దేశవ్యాప్తంగా దొంగచాటుగా మాదకద్రవ్యాల రవాణా జరుగుతూనే ఉంటోంది. అయితే దేశంలో ఎక్కడ మాదకద్రవ్యాల సరఫరాను అడ్డుకున్నా, సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎవరో ఒకరు అందులో ఉండటం విశేషం.తాజాగా హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. జూబ్లీహిల్స్లో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్లను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సినీ నిర్మాత సుశాంక్ రెడ్డితో పాటు, ఇద్దరు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 80 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిని పోలీసులు విచారిస్తున్నారు.

ఇలా మన దేశంలొకి నైజీరియా, జింబాంబే, ఉరుగ్వే, సొమాలియా లాంటి దేశాల నుండి ఎక్కువగా మాదకద్రవ్యాల రవాణా సాగుతోంది. ప్రధానిగా మోదీ ఎన్నికల తర్వాత యువత మద్యానికి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న డ్రగ్ మాఫియాపై పోలీసులు, నిఘా బృందాలు డేగకళ్లతో పహారా కాస్తున్నా, అదుపు చెయ్యలేకపోతున్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabadpolice  cocaine  drugs  drug gang  sushank reddy  

Other Articles