Sachin suggested that indian cricketrs have perform more better

sachin, indian cricket, indian team, pakistan, world cup, australia

sachin suggested that indian cricketrs have perform more better. the indian cricket team played very well since pakistan match. in the two matches india got great victory. sachin suggest the team members to give better performence.

ఇంకా బాగా ఆడాల్సి ఉంది: సచిన్ టెండూల్కర్

Posted: 02/24/2015 09:12 AM IST
Sachin suggested that indian cricketrs have perform more better

ఏ ఇద్దరు క్రికెట్ అభిమానులు కనిపించినా, వారు ఇండియా గురించి మాట్లాడుకుంటున్నారు. నిన్నటి దాకా ఎలాంటి నమ్మకాలు లేని ఇండియన్ క్రికెట్ టీం ఇప్పుడు హాట్ ఫేవరెట్ గా మారుతోంది. ఆస్ట్రేలియా టోర్నీలో ఒక్క గెలుపు కోసం కళ్లు వాచేలా ఎదురు చూసిన అభిమానులకు నిజంగా కనుల విందు చేస్తున్నారు. నిన్నటి దాకా  ఎలాంటి అంచనాలు లేని టీం, సగటు భారత అభిమాని కూడా అనుకోని విధంగా సంచనాలను నమోదు చేస్తోంది. జట్టులోని అందరు కసిగా ఆడుతూ, మిగిలిన టీంలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటి దాకా రెండు మ్యాచుల్లో ఇండియా అదరగొట్టింది. ఇక ముందు ఆడబోయే మ్యాచ్ లపై మరింత అంచనాలు పెరిగాయి.

అయితే భారత క్రికెటర్ల ఆట పట్ల చాలా మంది మాజీ, ప్రస్తుత క్రికెటర్లు స్పందిస్తున్నారు. భారత్ ను తక్కువగా అంచనా వెయ్యరాదని అందరు ఓ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా భారత క్రికెటర్ల ఆట తీరుపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకైతే చాలా మంచి ఆటను ప్రదర్శిస్తున్నారని, కానీ ఈ ఆట తనకు మాత్రం సంతృప్తిని కలిగించడం లేదని అన్నారు. ప్రస్తుతం భారత జట్టు ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతోందని సచిన్ తెలిపారు. అయితే జట్టులోని సభ్యులు తమ ఆట తీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. మొత్తానికి భారత జట్టుపై సచిన్ సలహాను, మన వాళ్లు ఎలా ఆచరిస్తారో వేచి చూడాలి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin  indian cricket  indian team  pakistan  world cup  australia  

Other Articles

Today on Telugu Wishesh