Chandrababu naidu have taken wrong decision

ttdp, krishnayya, chandrababu, cm babu, lb nagar mla, tdp in telangana, telanagan elections

tdp president chandrababu naidu announce r.krishnayya as a cm candidate in last telangana elections. r. krishnayya didnt give priority to the tdp but he is participating in bc welfare association activities,

కృష్ణయ్య విషయంలో చంద్రబాబు తప్పు చేశారా..?

Posted: 02/24/2015 08:28 AM IST
Chandrababu naidu have taken wrong decision

తెలంగాణలో టిడిపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిసి సంఘం నేత ఆర్.కృష్ణయ్యను గత ఎన్నికల్లో ప్రకటించారు చంద్రబాబు. తెలంగాణ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారు. అయితే తెలంగాణలో బిసి మంత్రాన్ని జపించిన బాబు, వారి ఓట్ల కోసం అప్పటి దాకా పార్టీలో సీనియర్లుగా ఉన్నవారిని కాదని కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని నింపింది. అయినా చంద్రబాబు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తెలంగాణ ఎన్నికల్లో బిసి మంత్రం కన్నా తెలంగాణ సెంటిమెంట్ బలంగా పని చెయ్యడంతో టిడిపి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ముందు నుండి పార్టీకి అన్ని విధాలుగా తోడుగా ఉంటున్న వారిని పట్టనపెట్టి, కృష్ణయ్యను ఇలా ముందుకు తీసుకురావడం పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే కృష్ణయ్య ముందు నుండి బిసి సంక్షేమ సంఘం నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఆయన పార్టీ కన్నా, పాత పద్దతిలొ సంఘానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో, పార్టీ సభ్యత్వ సమోదు కార్యక్రమం, ప్రతిపక్షాలను కట్టడి చెయ్యడంలో ఆయన అస్సలు ముందుకు రావడం లేదు. అదే బిసి సంక్షేమ సంఘం పేరుతో దీక్షలకు, ధర్నాలకు మాత్రం సిద్దంగా ఉంటారు. తాజాగా నెల్లూరులో దీక్షకు దిగుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నది టిడిపి పార్టీనే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిసిల కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని దీక్ష చేస్తున్నారు. ఇలా తనకు అవకాశం కల్పించిన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటం టిడిపిని ఇరుకున పెడుతోంది. కొందరైతే కృష్ణయ్య వ్యవహారంలో చంద్రబాబు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని బాహాటంగానే చెబుతున్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ttdp  krishnayya  chandrababu  cm babu  lb nagar mla  

Other Articles