Pawan kalyan twitter questioned bjp tdp alliances parties ap capital city farmers weaver loan problem

pawan kalyan news, pawan kalyan twitter, pawan kalyan twitter account, pawan kalyan campaign, pawan kalyan question, pawan kalyan tdp party, pawan kalyan bjp party, bjp tdp parties, pawan kalyan latest news, pawan kalyan updates, pawan kalyan movies, pawan kalyan political entry, pawan kalyan janasena party, pawan kalyan janasena, pawan kalyan janasena campaign

pawan kalyan twitter questioned bjp tdp alliances parties ap capital city farmers weaver loan problem : Finally powerstar, janasena party president pawan kalyan has questioned tdp bjp alliance party from his twitter account which gone viral on media.

ఎట్టకేలకు పవర్ స్టార్ ప్రశ్నలదాడి మొదలయ్యింది..

Posted: 02/23/2015 06:49 PM IST
Pawan kalyan twitter questioned bjp tdp alliances parties ap capital city farmers weaver loan problem

గతేడాది బీజేపీ-టీడీపీ కూటమికి సపోర్ట్’గా ఎన్నికల ప్రచారంలో మద్దతు పలికిన పవన్ కల్యాణ్.. ఆనాడే ప్రజలకు అన్యాయం జరిగితే తాను ప్రశ్నించడానికి ఎల్లప్పుడూ ముందుంటాను అని స్పష్టం చేసిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా అధికారంలో వున్న ఆ రెండు ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ తన ప్రశ్నలదాడిని మొదలుపెట్టేశాడు. గతకొన్నాళ్ల నుంచి సైలెంట్ గా వున్న పవన్.. ఇప్పుడు ప్రజలు, రైతుల తరఫున నిలబడి తనదైన రీతిలో ప్రశ్నించాడు.

ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే.. రైతులు తమ భూములు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. తమకు జీవనాధారమైన భూములను ప్రభుత్వానికి అంటగట్టడం ఇష్టంలేదంటూ నిరసనలు చేయడం మొదలుపెట్టారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న బీజేపీ.. అందుకు మొండిచెయ్యి చూపింది. అంతేకాదు.. నిధుల విషయంపై ఏమాత్రం నోరు మెదపడం లేదు. ఈ రెండు విషయాలను ప్రస్తావిస్తూ పవన్ ట్విటర్ లో ప్రశ్నించాడు. బీజేపీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందంటూ పేర్కొన్న పవన్.. అలాగే రైతు కన్నీరు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వానిదేనంటూ ఆయన ట్వీట్ల ద్వారా గొంతెత్తాడు.

ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట నిలబెట్టుకుంటుందనే అనుకుంటున్నానని ఆయన అన్నారు. గత ఏడాది పార్లమెంటులో గందరగోళ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లును నెగ్గించుకుందని, దానికి బీజేపీ కూడా మద్దతు తెలిపిందని అన్నారు. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మాట ఇచ్చిందని అని పేర్కొన్న ఆయన.. ఇపపుడు ఆ మాట నిలబెట్టుకునే సమయం బీజేపీకి వచ్చిందని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాగే రాజధాని నిర్మాణం, భూసేకరణ అంశాలను కూడా ప్రస్తావించాడు.  రైతులు కన్నీరు పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని, లేదంటే వారి ఆగ్రహానికి గురికావల్సి వస్తుందని అన్నారు. కొత్త రాజధాని నిర్మాణంలో రైతులు, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత జీవనం ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభత్వంపై ఉందన్నారు. ఎంతో నమ్మకంతో ప్రజలు టీడిపి - బీజేపి కూటమిని గెలిపించారు, వారి చూపించిన  నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని  ఆశిస్తున్నానని చెప్పారు.

ఇటీవలే కొందరు రైతులు పవన్ దగ్గరికి వెళ్లి తమ ఆవేదన వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే! ఆ నేపథ్యంలోనే తాజాగా పవన్ ఇలా వ్యాఖ్యలు చేసి వుంటారని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు.. ఎన్నికల ప్రచారంలో బీజేపీ-టీడీపీ కూటములు ఇచ్చిన హామీలను ఇంతవరకు తీర్చకపోవడంతో పవన్ పై విమర్శలు వచ్చాయి. ప్రభుత్వాలు ప్రజలకు అనుగుణంగా వ్యవహరించకపోతే తాను ప్రశ్నించడానికే వచ్చానని తెలిపిన పవన్.. ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడంలేదన్న విమర్శలు వచ్చాయి. అలా రావడంతోనే ఆయన ఇలా ట్వీట్ చేసి వుంటారని అంటున్నారు. ఏదైతేనేం.. ఎట్టకేలకు పవన్ తన ప్రశ్నల దాడి మొదలుపెట్టేశాడు. మరి.. ఈ ప్రశ్నలపై బీజేపీ-టీడీపీ కూటమి ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే!

pawan-kalyan-twitter-01

 

pawan-kalyan-twitter-02

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan twitter  janasena party news  bjp tdp alliance  

Other Articles