Hsbc says ceo stuart gulliver holds swiss account

hsbc, Stuart Gulliver, swiss ac, guardian newspaper, swiss,

Europe's biggest bank, HSBC said its chief executive, Stuart Gulliver, holds a bank account in Switzerland that was set up in 1998 to hold bonus payments, responding to a report in the Guardian newspaper that said he had a Swiss account that contained $7.6 million in 2007.

కాపాడతానన్నాడు..ఉన్నది కూడా దోచుకున్నాడు

Posted: 02/23/2015 05:09 PM IST
Hsbc says ceo stuart gulliver holds swiss account

బ్యాంక్ ను కాపాడతానని చెప్పిన వ్యక్తి కోట్ రూపాయలు నొక్కేశాడు. ఇలా నొక్కేసిన డబ్బులను స్విస్ బ్యాంక్ అకౌంట్లలో దాచుకున్నారట. ఈ విషయాన్ని గార్డియన్ వార్తాపత్రిక బయటపెట్టింది. స్కాముల్లో కూరుకుపోయిన హెచ్ఎస్బీసీ బ్యాంకును సంస్కరిస్తానని ఇన్నాళ్లూ చెబుతూ వస్తున్న ఆ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టువార్ట్ గలివర్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మే నెలలో బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఇది ప్రభుత్వానికి సవాల్ గా మారింది. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాల చేతికి అవినీతి ఆయుధాన్ని ప్రభుత్వమే అందించిందని అక్కడి మీడియా వార్తలను కూడా ప్రసారం చేసింది.

అక్రమంగా, దొంగతనంగా సంపాదించిన డబ్బులపై పన్ను ఎగవేతకు సహకరించిన హెచ్.ఎస్.బి.సి పై అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అన్ని దేశాలు దీనిపై తీవ్రంగా మండిపడ్డాయి. ఇదే తరహాలో గలివర్ కూడా 2007 సంవత్సరంలో రూ. 47.26 కోట్లను పనామాలో రిజిస్టర్ అయిన ఓ కంపెనీ పేరుమీద స్విస్ బ్యాంకులో దాచుకున్నట్లు తెలిసింది. స్వతహాగా బ్రిటన్కు చెందిన గలివర్, తన న్యాయపరమైన, పన్ను అవసరాల కోసం హాంకాంగ్లో ఉంటున్నారు. అయితే ఈ స్విస్ బ్యాంకు ఖాతా వ్యవహారంపై హెచ్ఎస్బీసీ వర్గాలు స్పందించ లేదు.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hsbc  Stuart Gulliver  swiss ac  guardian newspaper  swiss  

Other Articles