Rahul gandhi taking leave from party

rahul gandhi, sonia gandhi, congress, leave, meeting, parliament sessions.

rahul gandhi, who is no two in the congress party is going to leave for some days. in the april party meeting will be done so he is going to prepare to new stategy for the party.

ఇక సెలవు అంటున్న రాహుల్ గాంధీ

Posted: 02/23/2015 04:55 PM IST
Rahul gandhi taking leave from party

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు..రాహుల్ గాంధీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారు. కొన్ని రోజుల పాటు ఆయన సెలవు తీసుకోనున్నారు. ఆ విషయాన్ని సోనియాగాంధీ ధృవీకరించారు. పార్టీలో నెంబర్‌ టూగా ఉన్న రాహుల్‌ పార్లమెంట్‌ సమావేశాలకు ముందు సెలవు తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏప్రిల్ లో జరగనున్న నాయకత్వ సదస్సు వరకు రాహుల్ పార్టీకి దూరంగా ఉండనున్నారు. ఆ సదస్సుకు ఆయన పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యేందుకు ఈ సెలవు తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే పార్లమెంట్ సమావేశాలు జరుగుతన్న సమయంలో ఇలా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నేతగా చెబుతున్న రాహుల్ సెలవంటూ వెళ్లిపోవడం పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. భాజపా దూకుడుకు కళ్లెం వెయ్యాల్సిన సమయంలో ఇలా కాంగ్రెస్ నేత చేతులెత్తడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ తమ భవిష్యత్తు ప్రణాళికలను తయారు చేయాలనుకుంటోంది. ఏప్రిల్ లో జరగనున్న కాంగ్రెస్ కమిటీ సమావేశాల కోసం రాహుల్ పూర్తి స్థాయిలో సన్నద్ధం కానున్నారు. సెలవు సమయంలో రాహుల్ పార్టీ భవిష్యత్తు విధివిధానాలను రూపొందించనున్నారు. కొన్ని వారాల సెలవు తర్వాత మళ్లీ రాహుల్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాహుల్ కు అదనపు బాధ్యతలు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  sonia gandhi  congress  leave  meeting  parliament sessions.  

Other Articles