Obamas helicapter cabin will made in hyderabad

obama, tata, helocopter cabin, hydarbad, america, make in india, modi

american president barack obama security helicopters are in the process. the helicopters cabins will be made in hyderabad tata unit.

ఒబామా హెలికాప్టర్ క్యాబిన్ మేడిన్ హైదరాబాద్

Posted: 02/23/2015 04:44 PM IST
Obamas helicapter cabin will made in hyderabad

అగ్రరాజ్యం అమెరికా భద్రతతకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ప్రపంచానికి తెలుసు. ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షునికి లేని భద్రతను అమెరికా అధ్యక్షునికి కల్పిస్తుంది ఆ దేశం. అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీని వాడుతూ, ఎప్పటికప్పుడు లెటెస్ట్ గా తన వ్యూహాలను సిద్దపరుస్తుంది అమెరికా. అయితే అమెరికా అధ్యక్షుని కోసం కొత్తగా ప్రతిపాదించిన 21 విమానాలు ప్రస్తుతం తయారీ దశలో ఉన్నాయి. కాగా అమెరికా అధ్యక్షుని కోసం కావాల్సిన హెలికాప్టర్లను తయారు చేసే సంస్థ, క్యాబిన్ ల తయారీని మాత్రం భారత్ కు చెందిన అతి పెద్ద కంపెనీ టాటా కంపెనీకి అప్పగించింది. అయితే టాటా కంపెనీ ఈ హెలికాప్టర్ల క్యాబిన్ తయారీని హైదరాబాద్ యూనిట్ లో ఉత్పత్తి చెయ్యనున్నట్లు టాటాకు చెందిన అధికారులు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడి రక్షణ కోసం తయారు చేస్తున్న హెలిక్యాప్టర్లలో, కీలక క్యాబిన్ లను భారత్ లో అందులోనూ హైదరబాద్ లో తయారు చెయ్యడం నిజంగా విశేషమే. ఈ సంవత్సరం గణతంత్ర వేడుకలకు హాజరైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మన దేశ రక్షణ వ్యవస్థను మెచ్చుకున్నారు. ఇప్పుడు తనకు రక్షణ కల్పించే హెలికాప్టర్ క్యాబిన్ ను మన హైదరాబాద్ లో తయారు చెయ్యడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. బహుశా మోదీ చెప్పిన మేకిన్ ఇండియా కు అమెరికా సహకరిస్తున్నట్లు ఉందని అప్పుడే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : obama  tata  helocopter cabin  hydarbad  america  make in india  modi  

Other Articles

Today on Telugu Wishesh