Flipkart uses amazon package as dustbin

amazon, flipkart, e commerce, reddit india, twitter, social media

An image posted by Reddit India has created a buzz on social media and led to a Twitter war between e-commerce giants Flipkart and Amazon.The image shows an Amazon package in Flipkart's office reception. Many Twitter users began mocking the Indian e-commerce website after this post.

అమెజాన్ ను చెత్త డబ్బాగా వాడుతున్న ఫ్లిప్ కార్ట్

Posted: 02/23/2015 04:16 PM IST
Flipkart uses amazon package as dustbin

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఇ-కామర్స్ గురించి ఏ మాత్రం తెలిసిన వారికైనా ఈ రెండింటి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అయితే భారత విపణిలో రెండూ ఎంతో పోటాపోటీగా వ్యాపారాన్ని చేస్తున్నాయి. ఆఫర్ల దగ్గరి నుండి డెలివరి వరకు అన్నింటిలో రెండు సంస్థలు పోటీ పడుతున్నాయి. అయితే తాజాగా విడుదలైన ఓ ఫోటో కొత్త చర్చకు దారితీసింది. ఫ్లిప్ కార్ట్ ఆఫీస్ లొ అమెజాన్ కు చెందిన ఓ కాటన్ బాక్స్ ను చెత్త కుండీగా వాడటం విశేషం. అయితే రెండు సంస్థల మధ్య పోటీ సంగతి ఎలా ఉన్నా, ఇలా ఓ సంస్థ మరో సంస్థ పేరుతో ఉన్న కాటన్ ను చెత్త డబ్బాగా వాడటం మాత్రం వివాదమే.

e-commerce

అయితే ఈ ఫోటోకు సంబందించిన చర్చ నెట్ లొ హాట్ హాట్ గా సాగుతోంది. రెండు కంపెనీలకు చెందిన వ్యక్తు చేస్తున్న కామెంట్లు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రతి ఇ-కామర్స్ కంపెనీలో మా ప్రమేయం ఉండాల్సిందేనని అమెజాన్ అభిమాని ఒకరు కామెంట్ చెయ్యగా, ఫ్లిప్ కార్ట్ వస్తువులు కూడా అమెజాన్ నుండే వస్తున్నాయని మరొకరు కామెంట్ చేశారు. ఇక మరో వ్యక్తైతే రెండు కంపెనీలు కత్తులతో యుద్దానికి దిగాలని, ఎదరు గెలుస్తారో చూద్దామని కామెంట్ చేశారు. మొత్తానికి రెండు కంపెనీల వివాదం నెటిజన్లకు మంచి టైంపాస్ గా మారింది.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amazon  flipkart  e commerce  reddit india  twitter  social media  

Other Articles