Bomb threat for saibaba temple in dilsukhnagar

dilsukhnagar, bomb threat, bomb blast, hyderabad

some body call the police to warn about the bomb threat for saibab temple,dilsukhnagar. police search the temple and conform that there is no bombs. they hope unknown persons call for fun.

దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయానికి బాంబ్ బెదిరింపులు

Posted: 02/23/2015 03:43 PM IST
Bomb threat for saibaba temple in dilsukhnagar

హైదరాబాద్ లో జరిగిన బాంబ్ పేలుళ్ల గురించి దేశ వ్యాప్తంగా తెలుసు. దేశంలో ఎక్కడ బాంబ్ పేలుల్లు జరిగినా, వాటి మూలాలకు ఎక్కడో ఓ చోట హైదరాబాద్ కు సంబందం ఉంటోంది. హైదరాబాద్ లో దిల్ సుఖ్ నగర్ బాంబ్ పేలుళ్లు ఇప్పటికీ చాలా మందిలో భయాన్ని నింపింది. తాజాగా హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆలయంలో బాంబు పెట్టామని, అది పేలుతుందని గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. దాంతో భక్తులను అక్కడినుంచి ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్ తనిఖీలు చేశారు.  తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఎటువంటి బాంబు దొరకపోవడంతో ఊపరి పీల్చుకున్నారు. అయితే పోలీసులకు ఓ ఆకతాయి ఇలా బాంబ్ బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. తరచూ ఆకతాయిలు, పోలీసుల్ని ఆటపట్టించడానికి ఇటువంటి కాల్స్ చేస్తూ వారి సహనాన్ని పరీక్షిస్తున్నారు.


2002 సంవత్సరంలో తొలిసారిగా ఆలయం సమీపంలో బాంబు పేలుడు జరిగింది. 2007 సంవత్సరంలో బాంబు అమర్చారు గానీ, అది పేలకముందే ఓ పోలీసు కానిస్టేబుల్ దాన్ని గుర్తించడంతో ప్రమాదం తప్పింది. తాజాగా 2013 సంవత్సరంలో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోనే ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న ఎ-1 మిర్చి సెంటర్, వెంకటాద్రి థియేటర్ ఎదురుగా గల బస్ స్టాపు వద్ద కొద్దిపాటి తీవ్రతతో బాంబులు పేలాయి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dilsukhnagar  bomb threat  bomb blast  hyderabad  

Other Articles

Today on Telugu Wishesh