China pak got the information in the case of corporate spy

china, india, paistan, spy, corporate spy, reliance, petrolium ministry,

in the petrolium ministry, main files are stolen by some persons. in this case police noted that china, pakistan having information about india.

పాక్, చైనాల వద్ద భారత కీలక సమాచారం

Posted: 02/23/2015 03:17 PM IST
China pak got the information in the case of corporate spy

దేశంలో తీవ్ర సంచలనాన్ని సృష్టించిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో పత్రాల దొంగతనం కేసు, కీలక మలుపులు తిరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరున్న కార్పోరేట్ దిగ్గజాలు దొంగచాటుగా, పత్రాలను ఖాజేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు తేలింది, అయితే కార్పోరేట్ సంస్థలకు చెందిన పలువురు అధికారులను ఇందులో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో మరో కొత్త కొణం వెలుగులోకి వచ్చింది. తాజాగా తెలిసిన వివరాల ప్రకారం పెట్రోలియం మంత్రిత్వ శాఖ, మరి కొన్ని మంత్రిత్వ శాఖలకు సంబందించిన కీలక పత్రాలు చేతులు మారి, ఏకంగా వేరే దేశాలకు చేరుతున్నాయని తేలింది. అది కూడా భారత్ కు ముప్పు పొంచివున్న సరిహద్దు దేశాలు చైనా, పాకిస్థాన్ లకు ఈ పత్రాలు చేరినట్లు సమాచారం.

దేశంలో కార్పోరేట్ సంస్థల కొత్త రూపును బయటపెట్టిన కేసు మరిన్ని సంచనాలకు కేంద్ర బిందువుగా మారనుందా అనే సందేహం కలుగుతోంది. అయితే పాకిస్థాన్, చైనా దేశాలు గత కొంత కాలంగా భారత్ పట్ల కయ్యానికి కాలుదువ్వుతున్న వైనంగా కనిపిస్తున్నాయి. సరిహద్దుల దగ్గరి నుండి భారత్ కు రెండు దేశాలు అన్ని విషయాల్లో పోటీగా నిలుస్తున్నాయి. చైనా ముందు నుండి భారతదేశానికి చెందిన కీలక వ్యవహారాల్లో నిఘా ఉంచిందని మన దేశ నిఘా సంస్థలు ఎప్పుడో హెచ్చరించాయి. తాజాగా భారత్ లో జరుగుతున్న కార్పోరేట్ దొంగతనాలకు, దాయాది దేశాలకు సంబందం ఉన్నట్లు తేలింది. చైనా మన దేశానికి చెందిన కీలక గనులు, బొగ్గు ఖనిజాలు, నిక్షేపాల లాంటి వాటిపై కీలక సమాచారాన్ని సేకరిస్తోందని తెలుస్తోంది. దేశ భవిష్యత్తుకు సంబందించిన ఇలాంటి కీలక సమాచారం దేశాలు దాటి శత్రువుల చేతికి చేరడం దేశానికి మంచిది కాదు. దేశ శాంతి భద్రతలకు సంబందించిన విషయాల్లోనూ సరిహద్దు దేశాలు కలుగజేసుకునే అవకాశం ఉంది. అయితే మన దేశానికి సంబందించిన కీలక సమాచారం, ప్రభుత్వం భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు, వివిధ దేశాలతో చేసుకునే ఒప్పందాలకు సంబందించిన విషయాలు కూడా దొంగతనానికి గురయ్యాయా అని సందేహంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కార్పోరేట్ సంస్థల కోసం జరిగిన పెట్రోలియం మంత్రత్వ శాఖ దొంగతనం కేసులో అరెస్టు చేసిన వ్యక్తులు వెల్లడించిన విషయాలు దేశానికి సంబందించిన కీలక సమాచారాన్ని దేశం దాటించారని తెలుస్తోంది. అయితే దేశానికి చెందిన కీలక సమాచారం ఇలా కొందరు వ్యక్తులు చాలా సులువుగా దోచెయ్యడంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. కాగా పోలీసులు దర్యాప్తులో మరికొన్ని కొత్త అంశాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు అనుకుంటున్నారు. పెట్రోమంత్రిత్వ శాఖలో జరిగిన దొంగతనంతో అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  india  paistan  spy  corporate spy  reliance  petrolium ministry  

Other Articles