Venkaiah meets sonia

venkaiah meets sonia, venkaiah naidu meets sonia gandhi, venkaiah meets sonia ahead of budget sessions, parliament budget sessions, venkaiah naidu, sonia gandhi,

paliament affairs minister venkaiah naidu meets congress president sonia gandhi ahead of parliament budget sessions

పోనియాగాంధీతో వెంకయ్యనాయుడు భేటీ..

Posted: 02/22/2015 10:26 PM IST
Venkaiah meets sonia

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న తరణంలో అధికార పక్షం బీజేపి ప్రతిపక్షాల సహాయ సహకారాలు కోరే పనులపై దృష్టి సారించింది. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారం కోరే అంశం దాదాపుగా పూర్తి చేసుకుంటోంది. ఇందులో భాగంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఆదివారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. ఈ సమావేశాల్లో పలు ఆర్డినెన్స్లను చట్టరూపంలోకి మార్చాల్సిన అవసరం ఉన్నందున సమావేశాలను సజావుగా సాగేందుకు సహకరించాలని కోరినట్లు సమాచారం. ఈ ఆర్డినెన్సులను చట్టాలుగా మర్చేందుకు ఎగువ సభ (రాజ్యసభ)లో కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరం ఉండటం వంటి కారణాల వల్లే ఈ భేటీ జరిగినట్లు తెలిసింది.

సోనియాగాంధీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సమావేశం సజావుగా జరిగిందని, పార్లమెంటు కార్యకలాపాల్లో మద్దతుకోసమే సోనియాగాంధీని కలిసినట్లు చెప్పారు. తాము చేసే ప్రతిపనిని ప్రతిపక్షాలకు తప్పక వివరిస్తామని, వారు విలువైన సూచనలిస్తే తప్పక స్వీకరిస్తామని అన్నారు. అధికారపక్షం, మిత్రపక్షం  సమన్వయంతో ముందుకెళితేనే బాగుంటుందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parliament budget sessions  venkaiah naidu  sonia gandhi  

Other Articles