Land pooling amendement issue wil be discuss in this parliament sessions

land pooling, amendement, govt, the congress, rahul gandhi, anna hazare, ramllela ground, modi

land pooling amendement issue wil be discuss in this parliament sessions: the congress party and social activist anna hazare opposing the land pooling amendement. congress vice president rahul gandhi call for rally. new land pooling act is harmful for farmers rahul said.

పార్లమెంట్ లో భూసేకరణ బిల్లుపై "రణం"

Posted: 02/23/2015 07:46 AM IST
Land pooling amendement issue wil be discuss in this parliament sessions

కేంద్రం తీసుకువచ్చిన భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా అన్నాహజారే, కాంగ్రెస్ పార్టీలు నిరసనలు చేపట్టాయి. కేంద్రం రైతుల ప్రయోజనాలను మరిచి, కేవలం కొంత మంది కార్పోరేట్ వర్గాలకు మాత్రమే లబ్ది చేకూర్చేలా ప్రస్తుత భూసేకరణ బిల్లు ఉందని వారి ప్రధాన ఆరోపణ. ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కాంగ్రెస్ గత కొంత కాలంగా చతికిలబడింది. దాంతో కాంగ్రెస్ క్యాడర్ తీవ్ర నిరాశలో కూరుకుంది. కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి కాంగ్రెస్ తాజాగా భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించింది. అయితే లోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా, అన్నా హజారే రామ్ లీలా గ్రౌండ్ లో ఎన్ని సార్లు గొంతెత్తినా మాట్లాడని రాహుల్ గాంధీ, తాజా భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తు చేసే ఉద్యమానికి మాత్రం అన్నా హజారేను ఆహ్వానించడం గమనార్హం. అయితే అధికారంలో ఉన్నప్పుడు అన్నా హజారేను పట్టించుకోని రాహుల్ ఇప్పుడు మాత్రం అన్నా నామజపం చేస్తున్నారు. అటు అన్నా, ఇటు కాంగ్రెస్ పార్టీ ఆందోళనల ప్రభావం ఈ సారి జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలపై ప్రభావాన్ని చూపనున్నాయి. అయితే పార్లమెంట్ లొ భారీ మెజారిటిని కలిగిన ప్రస్తుత ప్రభుత్వం వీరి ఆందోళనలకు పెద్దగా స్పందించకపోవచ్చు. కానీ పార్లమెంట్ లో కొంత గందరగోళం నెలకొనే అవకాశాలు మాత్రం ఉన్నాయి. మొత్తానికి ఈ పార్లమెంట్ సమావేశాల్లో భూసేకరణ బిల్లు అధికార, విపక్షాల మధ్య నిప్పు రాజేసింది.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : land pooling  amendement  govt  the congress  rahul gandhi  anna hazare  ramllela ground  modi  

Other Articles