Shivasena challenge rahul kejruwal to auction their belonging items

shivasena, samna, modi,kejrwal, rahul gandhi, auction,

shivasena challenge rahul, kejruwal to auction their belonging items: shivasenas magazine samna publish a article, which is belonging to the auction of modis suit. shivasena challange rahul, kejriwal to auction their belonging items.

మోదీ సూట్ అంత..మరి రాహుల్,కేజ్రీల వస్తువులు..?

Posted: 02/21/2015 03:12 PM IST
Shivasena challenge rahul kejruwal to auction their belonging items

మోదీ సూట్ వేలం దేశవ్యాప్తంగా ప్రధాన వార్తగా నిలిచింది. పది లక్షల  సూట్ కు యాభై లక్షల నుండి ప్రారంభమైన బిడ్డింగ్ అతకంతకు పెరగి చివరకు 4 కోట్ల పైగానే అమ్మడుపోయింది. అయితే ప్రధానిగా మోదీ అధికారం చేపట్టినప్పటి నుండి ఆయన వాడిన వస్తువులను ఈ వేలంలో ఉంచారు. అయితే ఓ ప్రధాని వాడిన వస్తువులను ఇలా వేలం వెయ్యడం ఏంటని కొందరు విమర్శలు కూడా చేశారు. అయితే మోదీ సూట్ వేలం పై శివసేన కూడా స్పందించింది.

ప్రజాదరణ ఉన్న నేత కాబట్టే ప్రధాని మోదీ సూట్ మరి అంత ఖరీదు చేసింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వస్తువులను వేలం వేస్తే, ఎంతకు పోతాయో తెలుస్తుందని శివసేన తన పత్రిక సామ్నాలో ఓ కథనం ప్రచురించింది. అయితే రాహుల్ ఒక్కడి దగ్గరే ఆపకుండా ఆప్ అధినేతను లాగింది. మఫ్లర్ మ్యాన్ గా ఉన్న కేజ్రీవాల్ మఫ్లర్ కూడా వేలానికి పెడితే ఎవరి ఆదరణ ఎంత ఉందో తెలిసిపోతుందని పేర్కొంది. అయితే గత కొంత కాలంగా బీజేపీతో కయ్యానికి కాలుదువ్వని శివసేన ఇలా మోదీని అమాంతం ఆకాశానికెత్తడం రాజకీయ విశ్లేషకుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కాగా మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న శివసేన గతకొంత కాలంగా భాజపాతో విభేదిస్తూ వచ్చింది. మోదీ కొన్ని రోజుల క్రితం శరద్ పవార్ తో సన్నిహితంగా మెలగడంతో, ఎన్సీపి, భాజపాలు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయని వార్తులు వెలువడ్డాయి. బహుషా ఎన్సీపితో భాజపా దోస్తీ కట్టే ప్రమాదం ఉందనే, శివసేన ఇలా మోదీ జపం చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి వేలం వెర్రి ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shivasena  samna  modi  kejrwal  rahul gandhi  auction  

Other Articles