Nitesh kumar sent invitation for mamata

nitesh kumar, mamata benarjee, pledging ceremony, bihar new cm,

bihar next cm nitesh kumar invites westbengal cm mamata benarjee. mamata told that, she is waitng to see the programmee.

మమతాజీ..మీరు రావాలి అంటున్న నితీష్

Posted: 02/21/2015 01:51 PM IST
Nitesh kumar sent invitation for mamata

బీహార్ రాజకీయ నాటకం ముగిసింది. ఎట్టకేలకు బీహార్ రాజకీయ సంక్షోభానికి శుభం కార్డు పడింది..అలాగే నితీష్ కుమార్ కు శుభం జిరిగింది. మొత్తానికి బీహార్ సిఎం పదవి నుండి తప్పకున్న మాంఝీ స్థానంలో, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి అంతా సిద్దం చేసుకుంటున్నారు. తన ప్రమాణ స్వీకారానికి ఎవరెవరిని ఆహ్వానించాలో, వారందరికీ ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఎన్డీయే ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వుతున్న, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆహ్వానం అందింది. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి తాను వెళుతున్నానని మమత స్వయంగా వెల్లడించింది. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నానని మీడియాతో తెలిపింది. మొత్తానికి అతికష్టం మీద బీహార్ సిఎం కుర్చీ ఎక్కిన నితీష్, తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సన్నిహితులను, శ్రేయోభిలాషులను అందరిని ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.
 - అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nitesh kumar  mamata benarjee  pledging ceremony  bihar new cm  bihar  bihar politics  

Other Articles