Telanagana govt decided to pay 10 lakhs for each maytyrs family

telangana, sacrifice, govt of ts, kcr, compensation, maytyrs

for telanagana state several people sacrifice their lives. the telangana govt. decided to hepl the maytyrs familys. govt announce 10 lakhs and one job.

అమరుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థికసాయం

Posted: 02/21/2015 03:57 PM IST
Telanagana govt decided to pay 10 lakhs for each maytyrs family

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వందల మంది విద్యార్థులు, తెలంగాణ అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉద్యమంలో ఏ ఒక్క సారి రక్తపాతం లేకుండా జరిగిన ప్రజా ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ఏ ఉద్యమంలోనైనా హింసకు చోటుంటుంది, కానీ తెలంగాణ ఉద్యమంలో హింసకు చోటు లేదు. ఏ ఉద్యమంలోనైనా తమ డిమాండ్ల పరిష్కారానికి రక్తపాతం సృష్టించడానికి సిద్దంగా ఉంటారు కొందరు, కానీ తెలంగాణ ఉద్యమంలో తమ రక్తాన్ని తెలంగాణ తల్లికి తిలకంగా దిద్దిన త్యాగమూర్తులు ఎందరో ఉన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా ఆత్మహత్యలు తెలంగాణ ఉద్యమంలో చోటుచేసుకున్నాయి. తెలంగాణ తల్లి తన బిడ్డల బలిదానాలతో బంధవిముక్తి పొందింది.

అలా తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణాలు వదిలిన అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ప్రభత్వం నిర్ణయించింది. అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల వంతున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ఆయన తెలిపారు. అయితే తెలంగాణ అమరవీరుల కుటుంబాలను దుకోవాలని గత కొంత కాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. టిఆర్ఎస్ కూడా అమరుల కుటుంబాలను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.  అమరవీరుల సంఖ్య మీద, గతంలో వారికి ఇస్తామన్న మొత్తం మీద వివాదాలు తలెత్తాయి. దీనికి సంబంధించి ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, కలెక్టర్లు ఈ విషయాన్ని సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. కుటుంబంలో ఎవరికి ఉద్యోగం కల్పించాలనే విషయాన్ని కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవాలని తెలిపారు. ఒకవేళ అమరవీరుల కుటుంబ సభ్యులు తమలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం వద్దంటే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపుతామన్నారు. జాప్యం లేకుండా అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేస్తామన్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  sacrifice  govt of ts  kcr  compensation  maytyrs  

Other Articles