Sathna mayor sentenced controversial on scarfs

sathna mayor, mamatha pandey, madhyapradesh, scarfs, ledies,

sathna mayor mamatha pandey said that in there corporation circle, ladies dont have to wear scarfs. If anybody wear it, they will be constudy. and also suggested to them to have umberells instead of scarfs.

అమ్మాయిలు ముసుగులు ధరిస్తే జైలుకే

Posted: 02/21/2015 01:20 PM IST
Sathna mayor sentenced controversial on scarfs

పురుషాధిక్య సమాజంలో ఇప్పుడిప్పుడే మహిళల స్వేఛ్చగా తిరుగుతున్నారు. పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అయితే అప్పడప్పుడు కొదరు చేస్తున్న వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని, ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. ముసుగులు ధరించవద్దంటూ ఆ మధ్య వరంగల్ పోలీస్ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రంలో కలకలాన్నే రేపాయి. అమ్మాయాల స్వేఛ్చపై ఇలాంటి పరిమితులు పెట్టడానికి మీరెవరంటూ మహిళా సంఘాలు మండిపడ్డాయి. అయితే తాజాగా మధ్యప్రదేశ్ సత్నా మేయర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆడవారికి ఆడవారే శత్రువులు అన్నట్లుగా మమతా పాండే సాటి మహిళలపై ఇలా ఆంక్షలు విధించడం నిజంగా విశేషమే.

అమ్మాయిలు స్కార్ఫ్ కట్టుకుని బయట కనపడితే పోలీసులకు అప్పగిస్తామంటూ సాత్నా మేయర్ మమతా పాండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటి ఆగకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లే అమ్మాయిలెవరైనా ముఖంపై ముసుగుతో కనపడితే సాత్నా మున్సిపల్ కార్పొరేషన్, వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆమె అనడం గమనార్హం. హిందు సంప్రదాయం ప్రకారం మహిళలు తలపై కొంగు, ముస్లిం సంప్రదాయమైతే బురఖా ధరించడం, ఇతర మతాలకు చెందిన స్త్రీలు తమ తల భాగాన్ని ఏదైనా బట్టతో కప్పుకోవడం లాంటివి చేస్తారు. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి కనిపించడం లేదని, సంప్రదాయాలను మరిచి దొంగల తరహాలో ముఖాన్ని ముసుగుతో కప్పి ఉంచుతున్నారంటూ మేయర్ మాట్లాడటం వివాదానికి దారి తీసింది.

ఈ మధ్య జరుగుతున్న దొంగతనాల్లో చాలా వరకు ముసుగు ధరించిన వారే, దొంగతనాలకు పాల్పడుతున్నారని, వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని సాత్నా మేయర్ అన్నారు. అంతగా ఎండ, కాలుష్యం ఉంటే గుడ్డలు చిన్నగా కట్టుకోవాలని, ఎండ ఉంటే గొడుగు తెచ్చుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. మొత్తానికి మహిళా లోకానికి పురుషులు మాత్రమే అడ్డంకి కాదు తోటి మహిళలు కూడా అందులో పాలు పంచుకుంటున్నారా? అన్నట్లు సాత్నా మేయర్ వ్యాఖ్యలు ఉన్నాయి.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sathna mayor  mamatha pandey  madhyapradesh  scarfs  ledies  

Other Articles