Nitish kumar to be sworn in as bihar cm

nitish kumar to be sworn in as bihar cm, governer calls nitish kumar, bihar trust vote, nitish to show his majority, Manjhi steps down as bihar cm, secret behind manjhi governer meet, manjhi resigns as bihar chief minister, nitish kumar to return as bihar cm, Manjhi meets governer kn tripathi, why manjhi steps down as bihar cm, bihar chief minister jitin ram manjhi, Nitish Kumar, Jitan Ram Manjhi, Dissolution, Bihar CM, bihar assembly polls, Manjhi expelled from JD(u), Bihar CM, Jitam Ram Manjhi, Narendra Modi, Nitish Kumar, Political Play, Sharad Yadav, janata dal united president

Nitish Kumar to sworn in as new chief minister of bihar once again on 22nd febrary

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి నితీష్..

Posted: 02/20/2015 08:38 PM IST
Nitish kumar to be sworn in as bihar cm

బీహార్ లో ఎట్టకేలకు రాజకీయ సంక్షోభానికి తెరపడింది. బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ.. ముఖ్యమంత్రిగా కోనసాగిన జతిన్ రామ్ మాంఝీ మెట్టుదిగడంతో.. రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ మరోసారి ప్రమాణం చేయనున్నారు. ఆదివారం బీహార్ గవర్నర్ నితీష్ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందుకోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్.. నితీష్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.

బీహార్ తాజా ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ ఇన్నాళ్లు తాను ఎట్టి పరిస్థితులలో పదవికి రాజీనామా చేయనని, నితీష్ కుమార్ చేతిలో కీలుబోమ్మను కాదని భీష్మించడంతో మొదలైన రాజకీయ సంక్ష్ోభం ఇవాళ విశ్వాస పరీక్షకు ముందే పదవికి రాజీనామా చేయడంతో సమస్య కొలిక్కి వచ్చింది. బలపరీక్ష జరగడానికి ముందుగానే మాంఝీ రాజీనామా చేయడంతో.. బలపరీక్ష ఏమీ లేకుండానే అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. దీంతో బీహార్ అసెంబ్లీలో మెజార్టీ ఉన్న నితీష్ కుమార్ కు ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి లైన్ క్లియరైంది.

నితీష్ వారసుడిగా బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మాంఝీ జేడీయూతో విభేదించడంతో ఆయనకు మద్దతు ఇవ్వాలని బీజేపీ ప్రయత్నించినా కార్యరూపం దాల్చలేదు. ఓ దశలో బీహార్ రాజకీయం ఢిల్లీకి చేరింది. ఇలా అనేక మలుపులు తిరిగిన అనంతరం ఈ రోజు రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతు ఉన్న నితీష్ చివరకు తన కల నెరవేర్చుకున్నారు. దీంతో ఈ నెల 22న బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిందిగా నితీశ్ కుమార్‌ను ఆ రాష్ట్ర గవర్నర్ త్రిపాఠీ ఆహ్వానించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు నితీశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish Kumar  Jitan Ram Manjhi  swear in ceremony  Bihar CM  

Other Articles