Now whats app aslo keep check on crime

now whats app aslo keep check on crime, whats app aslo keep check on crime, social media whatapp, whatapp now controls crime, cyberabad police commisioner cv anand, cyberabad police commisioner, ips cv anand, whatsapp

social media whatsapp now controls and keep check on crime says cyberabad police commisioner cv anand

వారేవహ్ వాట్సప్.. నీతోనూ నేరాలకు చెక్..

Posted: 02/20/2015 03:36 PM IST
Now whats app aslo keep check on crime

రోజురోజుకు విప్లవాత్మక మార్పులతో నిత్యనూతనంగా వస్తూ.. అనేక మంది స్మార్ట్ ఫోన్లను వినియోగదారులను ఆకర్షిస్తూ.. దూసుకుపోతున్న సామాజిక మాధ్యమాలను అందుకునేందుకు మన పోలీసులు పోటీ పడుతున్నారు. ఇన్నాళ్లు తమకు జరిగిన అన్యాయంపై, లేదా లంచాలను డిమాండ్ చేసిన పోలీసులపై సదరు పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ లలో పిర్యాదు చేయాలని కోరిన పోలీసులు ఇప్పడు నేరాల అదుపుకు కూడా సామాజిక మాద్యమాన్ని వినియోగిస్తున్నారు.

దినదినాభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు నేరాల అదుపు, ప్రజలకు శాంతి భద్రతలను అందించేందుకు సైబరాబాద్ పోలీసులు సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వాట్సప్ను కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ప్రారంభించారు. నేరాలకు సంబంధించిన సమాచారంగానీ, ఫొటోలుగానీ, వీడియోలుగానీ పంపించాలనుకుంటున్నవారు ప్రత్యేకంగా కేటాయించిన వాట్సప్ నంబర్ 9490617444 ద్వారా పంపించవచ్చని తెలిపారు. నేరానికి పాల్పడిన వారి గురించి సమాచారం అందుకున్న వెంటనే వాట్సాఫ్ లో పోస్టు చేయాలని, దీంతో పోలీసులు సత్వర సేవలు అందిస్తారని చెప్పారు.ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అవుతుందని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

అలాగే ఇక నుంచి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి లేదా అంతకంటే ఎక్కువ హోదా ఉన్న ట్రాఫిక్ పోలీసులు మాత్రమే వాహన వినియోగదారులకు ఫైన్ విధిస్తారన్నారు. ఎస్ఐ కన్నా కింది ర్యాంకు పోలీసులైతే నియమ నిబంధనలు పాటించిన వాహనాలను ఫొటోలు మాత్రమే తీస్తారని చెప్పారు. ఈ విషయంలో ఏదైనా వివాదానికి దారి తీస్తే ఎస్ఐ వచ్చేంతవరకు ఆ వాహనాన్ని పక్కకు ఉంచాలని చెప్పారు.  అన్ని పత్రాలు ఉన్నప్పటికీ తప్పుడుగా ఫైన్ వేస్తే రశీదును స్వీకరించి వసూలు చేసిన పోలీసు అధికారిపై ఫిర్యాదు చేయొచ్చని, లేదా 9010203626 నెంబర్కు సంప్రదించాలని చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cyberabad police commisioner  cv anand  whatsapp  

Other Articles