No attempt to curtail amartya sen s tenure govt

amarthya sen, curtail, chanellor, governing board, ministry of external affairs,

The Government on Friday rejected Nobel laureate Amartya Sen’s contention that it does not want him to continue as Nalanda University Chancellor, saying there was no attempt to “curtail” his tenure and claimed that it was yet to receive the approved minutes of the Governing Board of Nalanda University.

అమర్థ్యసేన్ రాజీనామా వ్యవహారంపై ప్రభుత్వం ప్రకటన

Posted: 02/20/2015 04:45 PM IST
No attempt to curtail amartya sen s tenure govt

నలంద యూనివర్సిటి పదవి నుండి వైదొలుగుతున్నట్లు ప్రముఖ ఆర్థికవేత్త అమర్థ్యసేన్ ప్రకటించిన కొంత సేపటికే ప్రభుత్వం స్పందించింది. అమర్థ్యసేన్ ప్రభుత్వంపై అసంతృప్తి తెలుపుతూ రాసిన ఐదు పేజీల సుదీర్ఘ లేఖపై మినిస్ట్రి ఆఫ్ ఎక్స్ టర్నల్ ఎఫైర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం అమర్థ్యసేన్ వ్యవహారంపై ఎలాంటి తాత్సారం చెయ్యడం లేదని తెలిపారు. ప్రభుత్వం అమర్థ్యసేన్ పదవీ కాలాన్ని తగ్గించాలని అనుకోవడం లేదు అని ఆ ప్రకటన సారాంశం. ప్రభుత్వం తనను నలంద యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ గా కోనసాగించే ఉద్దేశం లేదేమో అని ఆయన ఓ టివి ఛానల్ ఇంటర్వూలో తెలిపారు. దాంతో అమర్థ్యసేన్ వ్యవహారంపై ప్రభుత్వం నుండి హడావుడిగా ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనతో అమర్థ్యసేన్ తన రాజీనామాను వెనక్కి తీసుకుంటారేమో చూడాలి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amarthya sen  curtail  chanellor  governing board  ministry of external affairs  

Other Articles