Our mlas received death threats says manjhi

Our MLAs received death threats, death threat to our mlas, bihar trust vote, nitish to show his majority, Manjhi steps down as bihar cm, secret behind manjhi governer meet, manjhi resigns as bihar chief minister, nitish kumar to return as bihar cm, Manjhi meets governer kn tripathi, why manjhi steps down as bihar cm, bihar chief minister jitin ram manjhi, Nitish Kumar, Jitan Ram Manjhi, Dissolution, Bihar CM, bihar assembly polls, Manjhi expelled from JD(u), Bihar CM, Jitam Ram Manjhi, Narendra Modi, Nitish Kumar, Political Play, Sharad Yadav, janata dal united president

Our MLAs received death threats says: Manjhi, after resigning as Bihar CM

‘‘మావాళ్లను చంపుతామని బెదిరింపు హెచ్చరికలు’’

Posted: 02/20/2015 11:11 AM IST
Our mlas received death threats says manjhi

అసెంబ్లీ లో బలప్రదర్శన కన్నా బీహార్ ప్రజల్లో జన బలం ముఖ్యమని అది తేలాలంటే.. బీహార్ లో తాజా ఎన్నికలే శరణ్యమని జనతాదళ్ యునైటెడ్ తిరుగుబాటు నేత  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జితన్ రామ్ మాంఝీ అన్నారు. విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న సమయానికి ముందగానే ఆయన బీహార్ రాష్ట్ర గవర్నర్ కేసరి నాథ్ త్రిపాఠిని కలసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తనకు ఇప్పటికీ 140 మంది కన్నా అధికంగానే ఎమ్మెల్యేలు ఓట్లు వేశేవారని చెప్పారు. అయితే ఇది రహస్య బ్యాలెట్ వుంటేనే సాధ్యమవుతుందని ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. కాగా బీహార్ స్పీకర్ తన అభ్యర్థన మేరకు రహస్య బ్యాలెట్ పెడతారన్న విశ్వాసం తనకు లేదని మాంఝీ అన్నారు.

అయితే తనకు మద్దతు నిస్తున్న ఎమ్మెల్యేలను చంపేస్తామంటూ కొందరు అగంతకుల నుంచి బెదిరింపు ఫోన్స్ కాల్స్ హెచ్చరికలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో వారు తనకు మద్దతు ఇవ్వడానికి జంకుతున్నారని తన అక్రోశాన్ని వెల్లగక్కారు. అసెంబ్లీ లోపల కన్నా ప్రజల్లో తనకు మద్దుతు అధికంగా వుందని మాంఝీ అన్నారు. బీహర్ ముఖ్యమంత్రిగా  తాను బాధ్యతలు నిర్వర్తించినా.. తనకు ముఖ్యమంత్రి హోదాకు లభించాల్సిన గౌరవం లభించలేదన్నారు. తనను ఏ పని చేయనీయకుండా అడ్డుకున్న సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నోరు విప్పి ఓక్క మాట కూడా మాట్లాడకుండా భీష్మపితామహుడు పాత్రను షోషించారని ఆరోపించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish Kumar  Jitan Ram Manjhi  Dissolution  Bihar CM  

Other Articles