1 81 crore bid for pm narendra modi s suit

modi, modi suite, auction, obama visit, bandhgala suite, bidding

On the last day of the three-day auction , the bid for Prime Minister Narendra Modi's pinstripe monogrammed bandhgala suit, which hogged limelight during President Barack Obama's visit last month, went up to Rs 1.81 crore.

మోదీ స్పెషల్ సూట్ @ 1.81 కోట్లు మాత్రమే

Posted: 02/20/2015 12:51 PM IST
1 81 crore bid for pm narendra modi s suit


మోదీకి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఎన్నికల ముందు నుండి మోదీకి అంతకంతకు పెరగుతున్న ఆదరణను ఎవ్వరూ కాదనలేరు. సినిమా స్టార్స్ వాడిన కార్లు, బైకులు ఎలా అయితే వేలానికి పెడతారో మోదీ వాడిన సూట్ ను కూడా వేలానికి ఉంచారు. ఇంకేముంది మోదీని అభిమానించే వారు సూట్ ను కొనడానికి క్యు కట్టారు. అయితే పది లక్షల విలువ చేసే సూట్ ధరకు అమాంతం రెక్కలు వచ్చాయి. సూట్ ధర ఏకంగా కోటి రూపాయలు దాటడంతో హాట్ టాపిక్ గా మారింది. మూడు రోజుల క్రితం ప్రారంభమైన మోదీ సూట్ వేలం 1.81 కోట్లకు చేరింది.

దేశ ప్రధాని వాడిన ఓ సూట్ ను ఇలా వేలానికి ఉంచడం ఏంటి అని చాలా మంది విమర్శించారు కూడా. మోదీ దీనిపై స్పందించాలని వారు డిమాండ్ చేశారు. మోదీ స్పందించలేదు కానీ మోదీ అభిమానులు మాత్రం వేలానికి పరుగులు పెట్టారు. సూరత్ లో జరుగుతున్న ఈ వేలానికి దేశంలోని చాలా మంది వ్యాపారవేత్తలు, ఎన్నారైలు వచ్చారు. ఒబామా భారత పర్యటనలో భాగంగా మోదీ ధరించిన సూట్ అందరిని ఆకర్షించింది. అయితే అదే సూట్ ఇప్పుడు వేలానికి ఉంచారు. రాజేష్ జైన్ అనే బిల్డర్ 1.65 కోట్లకు బిడ్ చెయ్యగా, హితేష్ పాటిల్ అనే వజ్రాల వ్యాపారి 1.61 కోట్లకు బిడ్ చేశారు. తాజాగా లావ్జీ పాటిల్ అనే వజ్రాల వ్యాపారి ఓకంగా 1.71 కోట్లకు బిడ్ వేశారు. ఇలా షేర్ మార్కెట్ లా పైకి దూసుకెళ్తూ 1.81 కోట్ల రూపాయలకు చేరింది. మొత్తానికి మోదీ సూట్ ఇంత వెల చెయ్యడం నిజంగా సంచలనమే.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  modi suite  auction  obama visit  bandhgala suite  bidding  

Other Articles

Today on Telugu Wishesh