Sonia wrote a letter to modi

sonia gandhi, letter, narendra modi, special status, andhra pradesh, manmohan singh, upa govt.

sonia wrote a letter to modi : congress president sonia gandhi wrote a letter to pm narendra modi. in that letter she propose to give special status to the andhra pradesh. the upa govt. promises to give special status and sevaral to andhra.

మోదీ గారికి....ఇట్లు సోనియా గాంధీ

Posted: 02/20/2015 12:10 PM IST
Sonia wrote a letter to modi

తెలుగు రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించిన కాంగ్రెస్, రాష్ట్ర విభజన సందర్భంగా పలు హామీలు ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయం చేస్తామని, రాజధాని నిర్మాణానికి ప్రత్యేకంగా కేంద్రం నుండి విడుదల చేస్తామని అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న యుపిఎ సర్కార్ ప్రకటనలు చేసింది.

ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది. కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరించడంతో భాజపా అధికారంలోనూ, కాంగ్రెస్ విపక్షంలోనూ కూర్చున్నాయి. అయితే తాము అధికారంలో ఉండగా చేసిన హామీలను అమలు చెయ్యాలని తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, రైల్వే బడ్జెట్ లో కేటాయింపులు చెయ్యాలని ఆ లేఖలో సోనియా కోరారు. మొత్తానికి బళ్లు ఓడలు..ఓడలు బళ్లు కావడం అంటే ఇదేనేమో, అధికారంలో ఉండగా ఇలాంటి విషయాలను పట్టించుకోని వారు ఇప్పుడు ఇలా మా మొర వినండి అంటూ లేఖలు రాయడం విశేషమేగా మరి!
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia gandhi  letter  narendra modi  special status  andhra pradesh  manmohan singh  upa govt.  

Other Articles

Today on Telugu Wishesh