Planes scrape each other at bengaluru show

airshow, banglore, Two planes scraped, Flying Bulls team

Two planes scraped each other today during a stunts display at the Aero India airshow in Bengaluru. The planes from the Flying Bulls team landed safely,

ITEMVIDEOS: ఒక విమానంతో మరో విమానం ఢీ..

Posted: 02/19/2015 05:13 PM IST
Planes scrape each other at bengaluru show


రెండు కార్లు ఢీ కొట్టడం సినిమాల్లో చూస్తుంటాం. కార్లు గాల్లో లేచి, అందులోని వాళ్లకు ఏంకాకుండా కిందికి దిగుతాయి. ఇదంతా సినిమాలో జరుగుతుంది. రెండు విమానాలు ఒకదాని మీదకు ఒకటి వచ్చి, దాదాపుగా క్రాష్ అయ్యాయి అనుకున్న విమానాలు, విమానాల్లోని పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఇదంతా జేమ్స్ బాండ్ సినిమాలో దో సీన్ లా అనిపించినా, బెంగళూరు ఎయిర్ షో సందర్భంగా జరిగిన సంఘటన.

బెంగళూరులో జరుగుతున్న ఎయిర్ షోలో పాల్గొన్న బుల్స్ టీంకు చెందిన రెండు విమానాలు విన్యాసాల్లో భాగంగా గాల్లో కొన్ని విన్యాసాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. చెక్ రిపబ్లిక్ కు చెందిన బుల్ టీం నలుగురు సభ్యులు ఎయిర్ షోలో తమ ప్రతిభను చాటుకున్నారు. చివర్లో రాడ్కా మకావ్ అనే మహిళ పైలెట్, తన విమానం మీదకు వస్తున్న మరో విమానాన్ని గమనించి వేగంగా స్పందించింది. దాంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. రెప్పపాటులో తప్పిన ప్రమాదంపై ఎయిర్ షోకు వచ్చిన వీక్షకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. బెంగళూరులో జరుగుతున్న ఎయిర్ షోను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. అత్భుతమైన విన్యాసాలతో అందరిని ఆకట్టుకునేలా సాగే ఈ ఎయిర్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టం. కానీ ఎలాంటి ప్రమాదం లేకుండా పైలెట్లు కిందకి దిగడం మాత్రం ఖచ్చితంగా అదృష్టమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : airshow  banglore  Two planes scraped  Flying Bulls team  

Other Articles