Tulsi gabbard to marry in april in vedic ceremony

ulsi gabbard to marry in april, tulsi gabbard marriage in vedic ceremony, Tulsi Gabbard first Hindu lawmaker in US Congress, Tulsi Gabbard Hindu lawmaker, Tulsi Gabbard, US Congress, Abraham Williams, cinematographer Abraham Williams

Tulsi Gabbard, the first ever Hindu lawmaker in the US Congress, would marry cinematographer Abraham Williams in April in a Vedic ceremony, a media report has said. The marriage will take place in Hawaii

అగ్రరాజ్యంలో హిందూ సంప్రదాయంలో వివాహం..

Posted: 02/19/2015 03:45 PM IST
Tulsi gabbard to marry in april in vedic ceremony

ఎక్కడ వున్నామన్నది ముఖ్యం కాదు.. ఎలా వున్నామన్నది ముఖ్యమని చాటిచెబుతోంది తులసి గాబార్డ్. హిందూ దేశంగా ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన భారతదేశంలో.. యువత ఎంతసేపు పాశ్చాత సంసృతుల వైపు ఆకర్షితులవుతుండగా, అందుకు భిన్నంగానే కాదు ఆదర్శంగా కూడా నిలుస్తోంది తులసి గబార్డ్. ఇంతకీ తులసి గబార్డ్ ఎవరంటారా..? అగ్రరాజ్యం అమెరికా కాంగ్రెస్లో అడుగుపెట్టిన తొలి హిందు సభ్యురాలు తులసీ గబార్డ్. అయితే ముఫై మూడేళ్ల తులసి త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నారు. సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్ (26) ను ఆమె వివాహం చేసుకోనున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్లో జరగనున్న వివాహం ద్వారా తాము ఒక్కటవుతున్నామని మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గురువారం ఆమె వెల్లడించింది.  తమ వివాహం హిందు సంప్రదాయ పద్దతుల్లోనే జరుగుతుందని తెలిపింది. ఇద్దరికి వివాహ నిశ్చితార్థం జరిగి నెల రోజులు దాటిందని పేర్కొంది. నిశ్చితార్థ సమయంలో డైమండ్ రింగ్ చేతి వేలికి తొడిగారని చెప్పారు. బోళాతనం, మంచితనం మూర్తిభవించిన వ్యక్తి అని అబ్రహం సుగుణాలను తులసీ ఈ సందర్భంగా కీర్తించారు. తనకు మాదిరిగానే అబ్రహం విలియమ్స్ కు కూడా పరులహితం కోరుకుంటారని చెప్పారు. విలియమ్స్ ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్గా విధులు నిర్వహిస్తూ ... మరో వైపు షార్ట్ ఫిల్మ్స్తోపాటు రాజకీయ, వాణిజ్య ప్రకటనల కోసం అడ్వర్టజమెంట్లు రూపొందిస్తున్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tulsi Gabbard  Hindu lawmaker  US Congress  Abraham Williams  

Other Articles