Kcr gives assurance to seemandhraites

KCR gives assurance to seemandhraites, kcr assures seemandhras, Mee Kallo Mullu Digithe..Na Panti Tho Theestha, "no settlers" all are telanganites says kcr, no settlers in Hyderabad, KCR's sudden love towards seemandhraites, GHMC polls, people from seemandhra, KCR to win the hearts of seemandhras, seemandhras in hyderabad

Telangana's hardcore crusader KCR, who was known for often using the word settlers, on Thursday surprised one and all by stating that there are "no settlers" in Hyderabad.

‘‘మీ పాదంలోని ముళ్లును.. నా పంటితో తీస్తా’’

Posted: 02/19/2015 04:36 PM IST
Kcr gives assurance to seemandhraites

మీ పాదానికి ముళ్లు గుచ్చుకుంటే.. నా పంటితో తీస్తాను ఈ డైలాగ్ ఎవరన్నారు.. ఎక్కడన్నారు.. ఎప్పుడన్నారు అని అడిగితే తెలుగు రాష్ట్ర ప్రజలకు చట్టుకున గుర్తుకువచ్చేది ఒకరి పేరే. అయనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు. అనేక సందర్భాల్లో ఈ డైలాగ్ ను ఆయన వాడారు. తొలిసారిగా కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అవిర్భావం సందర్భంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆయన వాడిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ తో ఆయన ఎప్పటికీ తెలంగాణ ప్రజల మదిలో చిరస్థాయిగా వుంటారు. ఇలా అనుకునే తెలంగాణవాసులకు ఆయన షాక్ ఇచ్చారు.

ఉద్యమం సాగినప్పుడల్లా తెరమీదరకు వచ్చి ఈ డైలాగ్ ను వల్లెవేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే.. మాట మార్చారు. డైలాగ్ అదే కానీ.. పక్షమే వేరంటున్నారు. ఇన్నాళ్లు తెలంగాణ పక్షాణ నిలిచిన ఆయన ఇప్పుడు కోత్తగా సీమాంధ్రల పక్షాన నిలిచారు. సీమాంధ్రులపై ఆయన ప్రేమ కురిపించారు. సీమాంధ్రుల ఆదరాప్యాయతలను గెలుచుకునేందుకు కొంత శ్రమిస్తున్నారు. కూకట్ పల్లి కేపీహెచ్.బిలో జరిగిన ఓ సమావేశంలో ఆయన సీమాంధ్రులనుద్దేశించి తెలంగాణలో నివసించే వారందరూ తెలంగాణ వాసులేనన్నారు. మీ పాదాలకు ముళ్లు దిగితే తన పంటితో తీస్తానని భరోసా కల్పించారు. సుమారు వెయి మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, పార్టీ శ్రేణులు టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సీమాంధ్రులపై ఆయన ప్రత్యేక ప్రేమ కనబర్చారు.

అయితే త్వరలో రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో భాగంగానే ఆయన ప్రేమ కనబరుస్తున్నారని విమర్శలు కూడా లేకపోలేదు. గ్రేటర్ పరిధిలో అధక సంఖ్యలో వున్న సీమాంధ్రుల ఓట్లను పొంది గ్రేటర్ పై కూడా గులాబి జెండాను అవిష్కరింపజేయాలన్న కాంక్షతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ డైలాగ్ వాడుతున్నారని పలువురు అంటున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని అధిక అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడంతో.. వారిని అన్ని రకాలుగా దగ్గర చేసుకుని గ్రేటర్ ఎన్నికలలో విజయాన్ని ఆస్వాధించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. మరి కేసీఆర్ ప్రయత్నాలు ఎంత మేరకు ఫలితాన్నిస్తాయో వేచి చూడాల్సిందే

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : seemandhras  KCR  Telangana  GHMC polls  

Other Articles