Mp kavitha described her father as star batsman

mp kavitha, star bats man, kcr, kcr birth day

mp kavitha described her father as star batsman : on kcr birth day mp kavitha attavd a function and cut the cake. she described her father as star batsman. he dont fear for small bowlers.

కెసిఆర్ స్టార్ బ్యాట్స్ మన్ అంటున్న ఎంపి కవిత

Posted: 02/17/2015 01:44 PM IST
Mp kavitha described her father as star batsman

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్టార్ బ్యాట్స్మెన్ అని అంటున్నారు ఎంపి కవిత. చిన్న బౌలర్లను చూసి ఆయన భయపడరని కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. పుట్టినరోజు జరుపుకోవటం మొదటి నుంచి కేసీఆర్కు అలవాటు లేదని ఆమె తెలిపారు. అభిమానులకు, ఇంట్లోవారికి, పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ బర్త్డే అంటే ప్రత్యేకత కాని, ఆయనకు కాదుని కవిత చెప్పారు . చిన్నప్పుడు నాన్న పుట్టినరోజు అయితే నేనే చాక్లెట్లు పట్టుకుని తిరిగేదాన్ని. ఆయనకు అసలు పుట్టినరోజు అని గుర్తే ఉండదు. రోజు మాదిరే తనపని తాను చేసుకుంటూ వెళిపోతారని కవిత తన తండ్రి కెసిఆర్ గురించి వివరించింది.  కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసిన కవిత, తన తండ్రిని తెలపొగిడేశారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా గాంధీ లాగా తెలంగాణకు స్వతంత్రం తెచ్చిన బక్కాయన అని కెసిఆర్ గురించి వ్యాఖ్యానించారు. తాజాగా కెసిఆర్ పుట్టిన రోజున గాంధీ, కెసిఆర్ లతో కూడిన కటౌట్ లు వెలిశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mp kavitha  star bats man  kcr  kcr birth day  

Other Articles