Shashi tharoor lashes out on media

shashi tharoor lashes out on media, progress in sunanda case, sit questions shashi tharoor, sunanda case probe, tharoor fires at media, dont telecast developed false stories, TRP ratings, False, Non-cooperation, Shashi Tharoor, Sunanda Probe

reports of my non cooperation in sunanda probe false says shashi tharoor

మీడియాపై కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కస్సుబస్సు..

Posted: 02/17/2015 10:06 AM IST
Shashi tharoor lashes out on media

కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ శశి థరూర్ మీడియాపై కస్సుబుస్సులాడారు. తన సతీమణి సునంద హత్యకేసులో మీడియా కట్టుకధలను ప్రసారం చేస్తుందని ద్వజమెత్తారు. టీఆర్పీ రేటింగ్స్‌ను పెంచుకునేందుకు టీవీ చానెల్స్ కట్టు కథలు ప్రసారం చేస్తున్నారంటూ ఆరోపించారు. తన భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో తాను సిట్ (స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం) ప్రత్యక దర్యాప్తు సంస్థకు సహకరించడం లేదని కథనాలను ఆయన తోసిపుచ్చారు. సిట్ అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు ఇవ్వకపోవడంతో, న్యూఢిల్లీ పోలీసులు తనను హెచ్చరించినట్టుగా వచ్చిన వార్తలపై ఆయన మండిపడ్డారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... టీఆర్పీ రేటింగ్ కోసం తనపై కట్టుకథలు ప్రసారం చేస్తున్నారని మీడియాపై మండిపడ్డారు. తాను విచారణకు సహకరించడం లేదంటూ వచ్చిన కథనాల్లో వాస్తవం లేదన్నారు. అసత్యాలను ప్రసారం చేసే మీడియా కాకుండా, నిజాయితీగా వ్యవహరించే జర్నలిజం దేశానికి చాలా అవసరమన్నారు. కాగా, సునంద కేసులో సిట్ ఇప్పటికే ఆయనను రెండుసార్లు ప్రశ్నించింది. సునంద హత్యకేసులో తాను అన్ని విషయాలను ప్రత్యేక దర్యాప్తు సంస్థకు తెలుపుతున్నాట్లు ఆయన తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : False  Non-cooperation  Shashi Tharoor  Sunanda Probe  

Other Articles