Temples flooded with devotees on maha shiv rathri

temples flooded with devotees on maha shivrathri, panchramalu rush, vemulavada rajanna, srisailam shivarathri bramhostavalu, bhimavaram somesharam, palakokku krira ramalingeshwara swamy, keesara rush, 1000 pillar tample at warangal, beeramguda bramarambhika mallikarjuna swamy Temple, bugga ramalingeshwaram, amaravathi amaralingeshwarudu

devotees are rushing to shiva temples for offering special prayers on maha shivarathri

శివ నామస్మరణతో మార్మ్రోగుతున్న శైవక్షేత్రాలు

Posted: 02/17/2015 09:10 AM IST
Temples flooded with devotees on maha shiv rathri

దేవదేవుడు మహాశివుడి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని ఆలయాలు శివనామస్మరణతో మార్ర్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి భోలా శంకరుడిని దర్శనం చేసుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని శైవక్షేత్రాలలొ శివనామస్మరణలు మిన్నంటాయి వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్దిగాంచిన అమరావతి అమరేశ్వర స్వామి, ద్రాక్షారమం భీమేశ్వరస్వామి, భీమవరం సోమేశ్వరస్వామి, పాలకొట్లు క్షీరరామలింగేశ్వర స్వామి, సామర్లకోట కాలభైరవ స్వామి ఆలయాలకు భక్తులు బారులు తీరారు.

 గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయం, వేములవాడ రాజన్న, కరీంనగర్ కాలేశ్వరం, వరంగల్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం, రంగారెడ్డిలోని కీసర ఆలయానికి, వికారాబాద్ లోని బుగ్గరామేశ్వరం, మెదక్ లోని వేయిస్థంబాల గుడి, మెదక్ జిల్లా రామచంద్రాపురంలోని బీరంగూడ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు ప్రముఖ శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందుకులు తలెత్తకుండా ఆలయ కమిటీ పలు జాగ్రత్తలు తీసుకుంది. ఆలయాల వద్ద పోలీసు పహారాను ఏర్పాటు చేశారు. ఉపవాస దీక్షల ఆచరిస్తున్న భక్తులు దైవనామస్మరణలో మినిగిపోతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahashivratri  special prayers  devotees  

Other Articles