Bjp mp poonam mahajan shahrukh khan mannath home vanity van ramp bmc

shahrukh khan mannat house, shahrukh khan vanity van ramp, bjp mp poonam mahajan news, mumbai bmc news, shahrukh khan house, shahrukh khan illegal construction, shahrukh khan photos, shahrukh khan fan movies, shahrukh khan movies list, shahrukh khan controversy

bjp mp poonam mahajan shahrukh khan mannath home vanity van ramp bmc : When bjp mp poonam mahajan takes serious action on shahrukh khan vanity van ramp's bms removes that which is illegal construction.

షారుఖ్ ఖాన్ కొంపను కొల్లేరు చేసిన బీజేపీ మహిళా ఎంపీ!

Posted: 02/14/2015 01:15 PM IST
Bjp mp poonam mahajan shahrukh khan mannath home vanity van ramp bmc

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న ఇంటి(మన్నత్)ని ఓ బీజేపీ ఎంపీ కొల్లేరు చేసేశారు. తనకు అనుకూలంగా వుండేవిధంగా షారుఖ్ రోడ్డును ఆక్రమిస్తూ ఓ ర్యాంప్ నిర్మించుకోగా.. దాన్ని పూర్తిగా తొలగించిపారేశారు. ఈ తతంగం మొత్తం తన ముందే జరుగుతున్నప్పటికీ ఆ నటుడు మాత్రం మిన్నకుండిపోయాడు. పైగా.. ఆ ర్యాంప్ ను తొలగించినందుకు అయిన ఖర్చును తీర్చాలంటూ అతని మీదే ఫైన్ విధించారు. దీంతో షారుఖ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు.

షారుఖ్ ఖాన్ తనకోసం 3.5 కోట్ల విలువగల ఓ వ్యానిటీ వ్యాన్ ను తయారు చేయించుకున్న విషయం తెలిసిందే! ఈ వ్యాన్ లో అత్యాధునిక లివింగ్ రూమ్, బెడ్ రూమ్, బాత్రూం సహా అన్ని సౌకర్యాలు వున్నాయి. అయితే.. దీనిని పార్క్ చేసుకునేందుకు అతని నివాసంలో అంతగా చోటు లేకపోయింది. దీంతో తన ఇంటిముందున్న రోడ్డును ఆక్రమిస్తూ ఆ వ్యాన్ కోసం ఓ ప్రత్యేక ర్యాంప్ ను నిర్మించుకున్నాడు. అంతే! అప్పటినుంచి అది పెద్ద వివాదంగా మారింది. స్థానికులు అటువైపుగా వుండే చర్చిని చేరుకోవడం కోసం వీలుగా వుండే ఆ రోడ్డుపై షారుఖ్ కేవలం తన వ్యానిటీ వ్యాన్ కోసం దాన్ని ఆక్రమించి, ర్యాంప్ నిర్మించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్ల నుంచి ఈ వివాదం జరుగుతూనే వుంది. అయితే.. షారుఖ్ ఏమాత్రం స్పందిచకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు.

షారుఖ్ అలా ర్యాంప్ ను అక్రమంగా నిర్మించుకోవడంపై చాలామంది ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు కానీ.. దానిని తొలగించలేకపోయారు. అయితే.. ఈ వ్యవహారాన్ని బీజేపీ ఎంపీ పూనం మహాజన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంపై ఆమె రంగంలోకి దిగిన వెంటనే బీఎంసీ షారుఖ్ కు నోటీసులు పంపింది. వాటిని అతను బేఖాతరు చేయడంతో రంగంలోకి దిగిన బీఎంసీ.. దానిని తొలగించేసింది. అలాగే దాన్ని తొలగించేందుకు అయిన బిల్లును షారుఖ్ కు పంపించింది. వెంటనే దాన్ని చెల్లించాలంటూ అతనికి హెచ్చరించింది. అలా కానిపక్షంలో అతనికి విద్యుత్, మంచినీరు సప్లైలపై చర్యలు తీసుకుంటామని బీఎంసీ వార్నింగ్ ఇచ్చింది కూడా! ఏదైతేనేం.. మొత్తానిని బీజేపీ ఎంపీ ఎంపీ పూనం మహాజన్ జోక్యం చేసుకోవడంతోనే షారుఖ్ కొంప కొల్లేరయ్యింది!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shahrukh khan mannat house  bjp mp poonam mahajan  

Other Articles