Arvid kejriwal oath as 8 th delhi cm

kejriwal, oath, delhi cm, ramlele ground, cabinet in delhi

arvid kejriwal oath as 8 th delhi cm : arvind kejriwal oath as delhi 8 th cm in ramlela ground. aap leaders and followers of kejriwal attend the programme. total 8 member cabinet oath today.

అరవింద్ కేజ్రీవాల్ అనే నేను భారత రాజ్యాంగానికి....

Posted: 02/14/2015 01:18 PM IST
Arvid kejriwal oath as 8 th delhi cm

అరవింద్ కేజ్రీవాల్ ఈ మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ఢిల్లీ సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ ఎనిమిదో ముఖ్యమంత్రిగా అరవింగ్ కేజ్రీవాల్ చేత లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రమాణం చేయించారు. ఆయనతో పాటుగా మరో ఆరుగురు మంత్రులుగా రామలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలోనే కేజ్రీవాల్ మంత్రి వర్గానికి బాధ్యతలు కూడా అప్పగించారు.

కేజ్రీవాల్ తర్వాత మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్య, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. వీరితో పాటు సత్యేంద్ర జైన్ ఆరోగ్యం, పరిశ్రమల శాఖ, గోపాల్ రాయ్ రవాణా, కార్మిక శాఖ, సందీప్ కుమార్ మహిళా శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమ శాఖ, జితేంద్ర తోమర్ న్యాయశాఖ, అసిమ్ అహ్మద్ పౌరసరఫరాలు, మైనారిటీ శాఖ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రామ్ లీలా మైదానంలో అట్టహాసంగా జరిగిన కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ఆప్ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. మరొ పక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంపై అంతర్జాతీయ మీడియాలోనూ కథనాలు వెలువడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kejriwal  oath  delhi cm  ramlele ground  cabinet in delhi  

Other Articles