Governor meeting with kcr and babu

governer meeting with two states cms, babu with kcr, kcr meet chandrababu naidu, nagarjuna sagar, nagarjunasagar problem

governor meeting with kcr and babu : governor meeting two states cm in rajbhavan. and decided to protest two states farms. babu requestd to governor to central govt protection to nagarjuanasagar

రెండు రాష్ట్రాల పంటలను కాపాడుకుందాం...గవర్నర్ భేటి తర్వాత ప్రకటన

Posted: 02/14/2015 12:52 PM IST
Governor meeting with kcr and babu

నాగార్జున సాగర్ పై వివాదంపై రాజ్ భవన్ లో చర్చ ముగిసింది. రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రలు, నీటిపారుదల శాఖ మంత్రులు, డిజిపిలు  పాల్గొన్నారు. ముఖ్యమంత్రులు సమావేశానికి ముందు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి గవర్నర్ నరసింహన్ తో భేటి అయ్యారు. తెలంగాణ అనుసరిస్తున్న వైఖరిని వివరించారు. తెలంగాణ తమకు అన్యాయం చేస్తోందని అనడం భావ్యం కాదని హరీష్ రావ్ అన్నారు.  నాగార్జున సాగర్ వద్ద కేంద్ర బలగాలు మోహరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గవర్నర్ ను  కోరినట్లు సమాచారం.

ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రితో భేటి అయిన గవర్నర్ కెసిఆర్ చెప్పిన వివరాలను విన్నారు. తర్వాత చంద్రబాబుతో విడిగా సమావేశమయ్యారు. అనంతరం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రలతో కలిసి భేటి అయ్యారు. అయితే ఏపికి రావలసిన నీటిని విడుదల చెయ్యాలని చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదనను కెసిఆర్ తిరస్కరించారని సమాచారం. గవర్నర్ తో భేటి తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజ్ భవన్ నుండి వెళ్లిపోయారు. అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక పరిష్కారానికి రావాలని గవర్నర్ సూచించినట్లు తెలిసింది.

రాజ్ భవన్ లో ముఖ్యమంత్రుల భేటి తర్వాత ఏపి మంత్రి దేవినేని ఉమ, తెలంగాణ మంత్రి హరీష్ రావ్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకులు, పోలీసులు డ్యాం మీదకు వెళ్లకూడదని నిర్ణయించినట్లు, ఇరు రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు మాత్రమే డ్యాంను పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపి మంత్రి దేవినేని ఉమ, తెలంగాణ మంత్రి హరీష్ రావ్ లు ప్రకటించారు. ఇరు రాష్ట్రాల్లో పంటలు ఎండిపోకుండా కాపాడుకోవాలని నిర్ణయించుకున్నామని మంత్రి హరీష్ రావ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధికారుల సహాయంతో నీటి విడుదలపై వచ్చే ఖరీఫ్ లో నిర్ణయం తీసుకోవాలని భావించినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల అధికారులు కూర్చుని సాగునీటి కోసం అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకోవాలని అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles