Congress should learn from aam aadmi party karti chidambaram

congress should learn from aap, karti chidambaram comments, karti chidambaram latest comments, karti chidambaram comments on congress, karti chidambaram comments on TNcc leaders, former union minister chidambaram son karti comments,

Continuing his tirade against the Congress, Karti Chidambaram has yet again lashed out at the party and asked them to take lessons from the Aam Aadmi Party in Delhi.

కాంగ్రెస్ నాయకత్వంపై కార్తీ చిదంబరం చిందులు..

Posted: 02/12/2015 03:51 PM IST
Congress should learn from aam aadmi party karti chidambaram

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలుకావడంతో.. పూర్తిగా చతికిల పడింది. కొద్దిగా ఆసరా తీసుకుని మళ్లీ లేగుద్దామని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నాయకులే ప్రత్యక్ష దాడికి పాల్పడి.. అచేతనావస్థకు కారణమవుతున్నారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో పదేళ్ల పాటు కీలక మంత్రిత్వశాఖల బాధ్యతలను కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం మరోసారి పార్టీపై విమర్శలతో పాటు పలు సూచనలు చేశారు. అంతేకాకుండా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ని చూసి నేర్చుకోవాలని కార్తీ చిదంబరం కాంగ్రెస్కు సలహాలు ఇచ్చారు.

కార్తీ చిదంబరం చెన్నలో మీడియాతో మాట్లాడుతూ.. 'అత్యధిక మెజారిటీతో గెలిచినందుకు 'ఆప్'కు అభినందనలు తెలిపారు. ఆప్ను చూసి కాంగ్రెస్ ప్రత్యేకించి...తమిళనాడు  కాంగ్రెస్ చాలా నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. రాష్ట్ర నాయకత్వం బాగుంటేనే పార్టీ బలోపేతం అవుతుందనే విషయం గమనించాలి.  పార్టీకి ఓ ప్రత్యేక ఎజెండాను తయారు చేసుకోవాలి. ప్రజాదరణ కలిగిన నాయకుణ్ని ఎంపిక చేయాలి. నాయకుడిని ఎంపిక చేయటంలో తొందరపాటు నిర్ణయాలు పనికి రావని అన్నారు.

ఇప్పటికే పలుమార్లు సొంత పార్టీపై విమర్శలు చేసిన కార్తీ అధిష్టానం నుంచి షోకాజ్ నోటీసులు కూడా అందుకున్నా.. తన ధోరణి మాత్రం మార్చుకోలేదు. ఇన్నాళ్లు తన తండ్రి హోదాకు మర్యాద ఇచ్చిన కాంగ్రెస్ నేతలు కార్తీ చిదంబరానికి కూడా అదే మర్యాదను ఇచ్చారు. మరి పదవి పోయిన తరువాత అదే మర్యాద రావాలంటే ఎలా లభిస్తుంది. అందుకే కార్తీ చిదంబరం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారని పార్టీ వర్గాల గుసగుసలాడుతున్నియి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  Aam Aadmi Party  Karti Chidambaram  

Other Articles